గేమ్ ఛేంజర్.. టికెట్స్ విషయంలో ఏం చేస్తారో?
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 5 Dec 2024 10:30 AM GMTటాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఆ మూవీ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన విడుదల కానుంది. దీంతో మెగా అభిమానులు మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు.
అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప -2 నేడు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మంచి టాక్ అందుకుని దూసుకుపోతున్న ఆ మూవీ టికెట్ రేట్లను భారీగా పెంచుకునేందుకు మేకర్స్.. తెలుగు రాష్ట్రాల నుంచి అనుమతులు అందుకున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణలో రేట్లు కాస్తంత ఎక్కువ ఉన్నాయి.
ఇప్పుడు భవిష్యత్తులో రానున్న గేమ్ ఛేంజర్ సహా పలు భారీ బడ్జెట్ మూవీస్ కూడా టిక్కెట్ రేట్ల విషయంలో పుష్ప లాంటి అనుమతులు తీసుకుంటాయనే ఊహాగానాలు వస్తున్నాయి.
గేమ్ ఛేంజర్ మేకర్స్ కూడా రేట్లను పెంచుకునేందుకు అభ్యర్ధించే అవకాశాలు బోలెడు ఉన్నాయి. కానీ పుష్ప సీక్వెల్ లాగా భారీగా రేట్లు పెంచితే.. ఆ వ్యూహం క్లిక్ అవుతుందో లేదో ఇప్పుడు అసలు ప్రశ్న.
ఎందుకంటే అన్ని సినిమాలకు హైప్ క్రియేట్ అవ్వదు. ఒక్కో మూవీకి ఒక్కోలా ఉంటుంది. పుష్ప-2 అనౌన్స్మెంట్ నుంచే మంచి బజ్ నెలకొంది. ఆ తర్వాత వరుస అప్డేట్స్ తో మేకర్స్ సందడి చేశారు. టీజర్, ట్రైలర్, సాంగ్స్, పోస్టర్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. వేరే లెవెల్ లో బజ్ క్రియేట్ చేశాయి. దీంతో అది మూవీకి బాగా ప్లస్ అయిందనే చెప్పాలి.
అయితే గేమ్ ఛేంజర్ పై ఇంకా పుష్ప రేంజ్ లో బజ్ క్రియేట్ అవ్వలేదు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ రెస్పాన్స్ బాగానే అందుకున్నాయి. కానీ అనుకున్నంత ఎఫెక్ట్ చూపించలేదు. అదే సమయంలో శంకర్ లాస్ట్ మూవీ భారతీయుడు 2.. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ గా మారింది. దాని వల్ల గేమ్ ఛేంజర్ పై ఇంకా హిట్ బజ్ క్రియేట్ అవ్వలేదనే చెప్పాలి.
దీంతో పుష్ప సీక్వెల్ లా టికెట్స్ పెంచితే కాస్త ఇబ్బంది అవుతుందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నిర్మాత దిల్ రాజు టికెట్ ధరలను ఎంత పెంచుతారోనని మాట్లాడుకుంటున్నారు. అలా అని అల్లు అర్జున్ మూవీ టిక్కెట్ ధర రూ.1200 ఉంటే, చరణ్ సినిమా టిక్కెట్లను కేవలం 300/-కి విక్రయించలేరుగా అని అంటున్నారు. అలా చేయడం వల్ల అల్లు అర్జున్ తో పోలిస్తే చరణ్ స్టార్ డమ్ చాలా తక్కువ అనే అభిప్రాయాన్ని సృష్టిస్తుందని చెబుతున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.