Begin typing your search above and press return to search.

గేమ్ చేంజర్ న్యూ అప్డేట్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు..

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది

By:  Tupaki Desk   |   7 Sep 2024 10:49 AM
గేమ్ చేంజర్ న్యూ అప్డేట్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు..
X

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సారి వినాయక చవితి సందర్భంగా చిత్ర బృందం తమ అభిమానులకు పెద్ద కానుకను అందించింది. గతంలో విడుదలైన సాంగ్ ఆడియన్స్ పై ఆశించిన ప్రభావం చూపకపోయినా, సెకండ్ సింగిల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే, సెకండ్ సింగిల్ ఈ సెప్టెంబర్ లో విడుదల కాబోతోందని స్పష్టం అయింది. పోస్టర్ లో రామ్ చరణ్ పూర్తి మాస్ లుక్ లో దర్శనమిచ్చారు. పెద్ద జాతర మధ్యలో చరణ్ నడిరోడ్డు మీద స్టైలిష్ లుక్ తో కిరాక్ ఫోజ్ ఇచ్చారు. చరణ్ స్టైల్, ఆ బ్యాక్ డ్రాప్ అంతా చూస్తే సినిమా ఓ మాస్ ఎంటర్‌టైనర్ గా ఉండబోతోందని అర్థమవుతోంది.

చాలా రోజులుగా ఫ్యాన్స్ అప్డేట్ కావాలని అడుగుతున్న విషయం తెలిసిందే. మేకర్స్ చాలా ఆలస్యం చేస్తున్నట్లు ఓ వర్గం అభిమానులు సోషల్ మీడియా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇక వెంటనే మేకర్స్ అప్డేట్ ఇవ్వక తప్పలేదు. వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. చరణ్ యొక్క ఈ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గేమ్ చేంజర్ సినిమా గురించి ఫ్యాన్స్ లో ఉన్న అంచనాలు మరింత పెరుగుతున్నాయి. దీనికి తోడు సెకండ్ సింగిల్ అప్డేట్ తో సినిమా మ్యూజిక్ పరంగా కూడా ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. థమన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణగా నిలవబోతోందని ఇప్పటికే దర్శకుడు వివరణ ఇచ్చారు.

మాస్ బీట్‌తో ఈ సెకండ్ సింగిల్ అభిమానుల హృదయాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఇక రామ్ చరణ్ మునుపెన్నడూ చేయని డ్యూయల్ రోల్‌లో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తుండగా, ఎస్ జె సూర్య కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

ఈ సినిమా మ్యూజిక్, భారీ యాక్షన్ సన్నివేశాలు, భారీ సెట్‌లతో మాస్ ప్రేక్షకులకు పండుగ వాతావరణాన్ని తెచ్చే అవకాశం ఉంది. వినాయక చవితి పండుగ సందర్భంగా మ్యూజిక్‌తో పాటు, సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ రావడం ఖాయమని భావిస్తున్నారు. మరి సెకండ్ సాంగ్ సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.