Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్.. ఏం చేస్తున్నట్లు..

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పై మేకర్స్ ఎలాంటి నమ్మకంతో ఉన్నారో గాని ఇప్పటివరకు ఆడియెన్స్ లో కిక్కిచ్చే అప్డేట్ అయితే ఒక్కటి కూడా ఇచ్చింది లేదు.

By:  Tupaki Desk   |   17 Sep 2024 6:52 AM GMT
గేమ్ ఛేంజర్.. ఏం చేస్తున్నట్లు..
X

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పై మేకర్స్ ఎలాంటి నమ్మకంతో ఉన్నారో గాని ఇప్పటివరకు ఆడియెన్స్ లో కిక్కిచ్చే అప్డేట్ అయితే ఒక్కటి కూడా ఇచ్చింది లేదు. దానికి తోడు శంకర్ ఇండియన్ 2 తో షాక్ ఇవ్వడంతో ప్రాజెక్టుపై మరింత అనుమానాలు వస్తున్నాయి. దిల్ రాజు, థమన్ అప్పుడప్పుడు కాస్త సినిమాను లేపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ రామ్ చరణ్ నుంచి స్ట్రాంగ్ గా పాజిటివ్ టాక్ ఒక్కటి కూడా రాలేదు.

మిగతా వాళ్ళు అసలు కాన్ఫిడెన్స్ తో కనిపించడం లేదనే కామెంట్స్ కూడా గట్టిగానే వస్తున్నాయి. ఎందుకంటే మేకర్స్ కనీసం అప్డేట్స్ కూడా అనుకున్న టైమ్ కు ఇవ్వడం లేదు. సెప్టెంబర్ నెల అర్ధభాగం దాటినా, "గేమ్ ఛేంజర్" సినిమా నుండి అనుకున్నట్లు అప్డేట్లు రావడం లేదు. వినాయక చవితి సమయానికి రెండో సాంగ్ విడుదల చేస్తామని ప్రకటించినా, ఆపైన సౌండ్ లేదు.

తమన్ సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నా, అసలు సాంగ్ ఎప్పుడు వస్తుందనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఫ్యాన్స్ మాత్రం "జరగండి జరగండి" పాటలో జరిగిన పొరపాట్లు మరోసారి పునరావృతం కాకూడదని ఆశిస్తున్నారు. మరోవైపు, దర్శకుడు శంకర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.

తాజా సమాచారం ప్రకారం, ఎడిటర్ విషయంలో మార్పు చేయాల్సి వచ్చిందని, షామీర్ మహమ్మద్ స్థానంలో అంటోనీ రూబెన్స్ ను ఎడిటర్ గా తీసుకున్నట్లు చెన్నై వర్గాలు తెలియజేస్తున్నాయి. శంకర్ సిజి వర్క్స్ దగ్గరుండి చూసుకుంటున్నారని, డెడ్ లైన్స్ గురించి పెద్దగా ఆలోచించకుండా సమయానికి పని పూర్తి చేయాలని కృషి చేస్తున్నారని తెలుస్తోంది. ఇక డిసెంబర్ 20 ని విడుదల తేదీగా లాక్ చేసినప్పటికీ, అధికారిక ప్రకటన రాలేదు.

దీంతో మళ్ళీ రిలీజ్ విషయంలో ఏదైనా ట్విస్ట్ ఇస్తారేమో అనే డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. ఏదేమైనా "ఇండియన్ 2" విషయంలో వచ్చిన విమర్శలు, అవమానాలు దృష్టిలో ఉంచుకుని శంకర్ ఈ సినిమాను పెద్ద సక్సెస్ చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాకుంటే శంకర్ కెరీర్ ట్రాక్ లోకి రావడం చాలా కష్టం. మరి ఆయన ఎలాంటి అవుట్ పుట్ ఇస్తారో చూడాలి. "గేమ్ ఛేంజర్" భారీ బడ్జెట్‌తో పొలిటికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందు రానుంది. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా అంజలీ, కియరా అద్వానీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.