Begin typing your search above and press return to search.

గేమ్ చేంజర్ ప్రీమియర్స్… నెవ్వర్ బిఫోర్ ప్లాన్

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీమియర్స్ ని దిల్ రాజు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   20 Dec 2024 5:31 AM GMT
గేమ్ చేంజర్ ప్రీమియర్స్… నెవ్వర్ బిఫోర్ ప్లాన్
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ మూవీ జనవరి 10న థియేటర్స్ లోకి రాబోతోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. రామ్ చరణ్ కెరియర్ లోనే సోలోగా హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రంగా ఈ మూవీ ఉండబోతోంది. అలాగే స్టార్ డైరెక్టర్ శంకర్ ఫస్ట్ టైం తెలుగులో చేస్తోన్న సినిమా కావడంతో ‘గేమ్ చేంజర్’ పై మెగా ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు.

శంకర్ కి వరుస ఫ్లాప్ లు వచ్చిన మరల ఈ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అవుతాడని అనుకుంటున్నారు. నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అందుకే ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ఈ మూవీ ప్రమోషన్స్ గ్రాండ్ గా చేస్తున్నారు. భారీ ఈవెంట్స్ ప్లాన్ చేశారు. డిసెంబర్ 21న ‘గేమ్ చేంజర్’ ఫస్ట్ ప్రీరిలీజ్ ఈవెంట్ యూఎస్ లో జరగబోతోంది. ఈ ఈవెంట్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

యూఎస్ ఈవెంట్ తర్వాత గేమ్ చేంజర్ సౌండ్ జనాల్లోకి వెళ్తుందని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీమియర్స్ ని దిల్ రాజు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఒక రోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ ని తెలుగు రాష్ట్రాలలో అత్యధిక స్క్రీన్స్ లో వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసారంట. ఈ పెయిడ్ ప్రీమియర్ షోల కోసం ఇప్పటికే డిస్టిబ్యూటర్స్ తో దిల్ రాజు చర్చించినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు కూడా ‘గేమ్ చేంజర్’ పెయిడ్ ప్రీమియర్ షోలకి అడ్డు చెప్పే ఛాన్స్ లేదు.

టికెట్ ధరలు కూడా దిల్ రాజు అడిగినంత ప్రభుత్వాలు ఇచ్చే అవకాశం అయితే పుష్కలంగా ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ నుంచి పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోన్న సినిమా ఇదే కావడంతో ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ కెరియర్ లోనే నెవ్వర్ బిఫోర్ అనే విధంగా భారీ ఎత్తున ఈ ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటికి పాజిటివ్ టాక్ వస్తే ఆటోమేటిక్ గా సినిమా పబ్లిక్ లోకి వెళ్ళిపోతుంది.

అందుకే దిల్ రాజు ఈ ప్రీమియర్ షోల విషయంలో గట్టి ప్లాన్ తో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ కూడా ఈ ‘గేమ్ చేంజర్’ ప్రమోషన్ కోసం దేశం మొత్తం తిరగబోతున్నాడు. బాలీవుడ్ లో చరణ్ కి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అక్కడ చాలా మంది స్టార్స్ తో చరణ్ కి మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్స్ ని ‘గేమ్ చేంజర్’ ప్రమోషన్స్ కోసం చీఫ్ గెస్ట్ లుగా తీసుకొచ్చే ప్లాన్ కూడా జరుగుతోందని ఇండస్ట్రీ వర్గాలలో అనుకుంటున్నారు.