Begin typing your search above and press return to search.

'గేమ్ ఛేంజ‌ర్' లో ఆ స‌న్నివేశాలు..రాజ‌కీయ చ‌ర్చ త‌ప్ప‌దా?

ఇది పోలిటిక‌ల్ యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ స్టోరీ. ఐఏఎస్ ఒక్క‌సారిగా రాజ‌కీయ నాయ‌కుడిగా మారితే ఎలా ఉంటుంది?

By:  Tupaki Desk   |   19 Nov 2024 9:30 AM GMT
గేమ్ ఛేంజ‌ర్ లో ఆ స‌న్నివేశాలు..రాజ‌కీయ చ‌ర్చ త‌ప్ప‌దా?
X

తెలంగాణ‌లో టీ-కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పాటయ్యాక సీఎం రేవంత్ రెడ్డి అక్ర‌మ క‌ట్ట‌డాల‌పై ఎలా ఉక్కుపాదం మోపారో తెలిసిందే. హైడ్రా ఎటాక్ తో ఒక్క‌సారిగా దేశ‌మంతా హైద‌రాబాద్ వైపు చూసింది. చెరువులు, ప్ర‌భుత్వ స్థ‌లాలు ఆక్ర మించి క‌ట్టిన అక్ర‌మ క‌ట్ట‌డాలు అన్నింటిని హైడ్రా కూల్చ‌డం అన్న‌ది సినిమా స‌న్నివేశాల్నే త‌ల‌పించింది. గంట ముందు చూసిన బిల్డింగ్ గంట త‌ర్వాత నేల మ‌ట్టం చేసిన చ‌రిత్ర రేవంత్ కే చెల్లింది.

మ‌రి ఇలాంటి స‌న్నివేశాలు రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తోన్న 'గేమ్ ఛేంజ‌ర్' లో ఉండ‌బోతున్నాయా? ద‌ర్శ‌కుడు శంక‌ర్ అలాంటి స‌న్నివేశాల‌కు సినిమాలో తావు ఇచ్చారా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఇది పోలిటిక‌ల్ యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ స్టోరీ. ఐఏఎస్ ఒక్క‌సారిగా రాజ‌కీయ నాయ‌కుడిగా మారితే ఎలా ఉంటుంది? స‌మాజంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు? అన్న‌ది శంక‌ర్ మార్క్ లో హైలైట్ చేయ‌బోతున్నారు.

అయితే దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం అయిన హైద‌రాబాద్ హైడ్రా ఎటాక్ నేప‌థ్యంలో కూడా కొన్ని స‌న్నివేశాలు చిత్రీ క‌రిస్తున్నారుట‌. అయితే వీటిని శంక‌ర్ కాపీ కొట్టలేదు. హైద‌రాబాల్ లో హైడ్రా ఎటాక్ ఘ‌ట‌న జ‌ర‌ప‌క ముందే? త‌న క‌థ‌లో ఈ స‌న్నివేశాలు ముందుగానే రాసిపెట్టుకున్న‌ట్లు లీకులందుతున్నాయి. హీరో రోల్ ని ఇంట‌ర్ డ్యూస్ చేసే స‌మ‌యంలో బ్యాక్ డ్రాప్ లో ఈ స‌న్నివేశాలు వ‌స్తాయ‌ట‌.

ఆ స‌మ‌యంలో ఎలాంటి రాజ‌కీయ నాయ‌కుల పేర్లు గానీ, ప్రాంతం పేరుగానీ ఉండ‌ద‌ని, మొత్తం వ్య‌వ‌స్థ‌లో ఉన్న లోపాల్ని ఎత్తి చూపే క్ర‌మంలోనే హైడ్రా స‌న్నివేశాలు వ‌స్తాయ‌ని స‌మాచారం. ఈ స‌న్నివేశాల్ని గ‌త ఏడాదే చిత్రీక‌రించార‌ని తెలిసింది. మొత్తానికి తెలంగాణ హైడ్రా ఘ‌ట‌న కూడా సినిమాలో హైలైట్ అవుతుంద‌ని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది కాబ‌ట్టి మ‌ళ్లీ హైడ్రా చ‌ర్చ రిలీజ్ రోజున త‌ప్ప‌దు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో రిలీజ్ చేస్తున్నారు.