చరిత్ర సృష్టించబోతున్న 'గేమ్ ఛేంజర్'.. దేశంలోనే ఇది తొలిసారి!
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ -శంకర్ కలయికలో తెరకెక్కిన `గేమ్ ఛేంజర్` 10 జనవరి 2025న ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధంగా ఉంది
By: Tupaki Desk | 22 Nov 2024 5:15 PM GMTమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ -శంకర్ కలయికలో తెరకెక్కిన `గేమ్ ఛేంజర్` 10 జనవరి 2025న ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధంగా ఉంది. కేవలం మరో రెండు నెలలు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఇంతలోనే ఈ సినిమా ప్రచారంలో వేగం పెంచింది చిత్రబృందం. ఇటీవల చిత్ర బృందం చరణ్ ఉన్న అద్భుతమైన కౌంట్ డౌన్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇంతలోనే మరో భారీ ప్రకటనతో ఆశ్చర్యపరిచారు.
ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను మునుపెన్నడూ లేని విధంగా అమెరికాలో నిర్వహించనున్నామని దిల్ రాజు బృందం ప్రకటించింది. దీంతో అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా గేమ్ ఛేంజర్ రికార్డులకెక్కనుంది. ఈ గ్రాండ్ ఈవెంట్ డిసెంబర్ 21 న జరగనుంది. ఇక ఈ కార్యక్రమానికి గేమ్ ఛేంజర్ మొత్తం తారాగణం, టెక్నీషియన్లు అమెరికా వెళతారని సమాచారం. ఈ మెగా మాస్ ఈవెంట్‌ను చరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లేపల్లి నిర్వహిస్తున్నారు.
శంకర్ భారీతనం నిండిన సినిమాల ఎంపికల్లోనే కాదు.. వాటిని మార్కెట్ చేసే విధానంతోనూ ఆకట్టుకుంటాడు. భారీ బడ్జెట్ సినిమాలను ఎలా ప్రమోట్ చేస్తే ఎక్కువ మైలేజ్ సాధ్యమో అతడికి బాగా తెలుసు. ఇప్పుడు అతడు మరోసారి దీనిని నిరూపించబోతున్నాడు. అగ్ర రాజ్యం అమెరికాలో ప్రీరిలీజ్ తో ఈ మూవీపై హైప్ మరింత పెరుగుతుంది. సరైన సమయంలో అదిరిపోయే బ్లాక్ బస్టర్ తో కంబ్యాక్ అవ్వాలని శంకర్ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసారు. దిల్ రాజు లాంటి మాస్టర్ మైండ్ అతడితో ఉంది కాబట్టి గేమ్ ఛేంజర్ ని బ్లాక్ బస్టర్ గా నిలబెడతారని మెగాభిమానులు భావిస్తున్నారు.