Begin typing your search above and press return to search.

యూఎస్ ప్రీమియర్స్.. గేమ్ ఛేంజర్ పరిస్థితి ఎలా ఉందంటే..

అయితే ఈ ఏడాది వచ్చిన స్టార్ హీరోల సినిమాలతో పోల్చుకుంటే రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ పట్ల యూఎస్ లో పబ్లిక్ ఇంటరెస్ట్ తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   29 Dec 2024 10:21 AM GMT
యూఎస్ ప్రీమియర్స్.. గేమ్ ఛేంజర్ పరిస్థితి ఎలా ఉందంటే..
X

మన ఇండియన్ సినిమాలకి యూఎస్ లో ప్రీమియర్ షోలు ప్రత్యేకంగా వేస్తోన్న సంగతి తెలిసిందే. ఇండియాలో మూవీ రిలీజ్ కి ఒక్క రోజు ముందుగానే యూఎస్ లో ప్రీమియర్ షోలు పడతాయి. ఇక ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నెల రోజుల ముందుగానే ఓపెన్ చేస్తారు. ఇక ఇండియన్ సినీ ప్రేమికులు ఈ ప్రీమియర్ షోల కోసం ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటారు.

టికెట్ ధరలు భారీగా ఉన్న కూడా సినిమాకి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ముందుగానే టికెట్స్ అమ్ముడైపోతూ ఉంటాయి. ఈ ఏడాది టాలీవుడ్ స్టార్ హీరోల నుంచి మూడు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అయ్యాయి. 2025 ఆరంభంలో సంక్రాంతి కానుకగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి ‘గేమ్ చేంజర్’ థియేటర్స్ లోకి రాబోతోంది. ఇది కూడా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకొస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీమియర్ షోల కోసం అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ చేశారు. అయితే ఈ ఏడాది వచ్చిన స్టార్ హీరోల సినిమాలతో పోల్చుకుంటే రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ పట్ల యూఎస్ లో పబ్లిక్ ఇంటరెస్ట్ తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రీమియర్ షోల టికెట్స్ ప్రీ సేల్ లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మూవీ రిలీజ్ కి ఇంకా 12 రోజుల సమయం ఉంది.

అయితే ఇప్పటి వరకు ‘గేమ్ చేంజర్’ ప్రీమియర్స్ కోసం 11 వేల టికెట్స్ మాత్రమే బుక్ అయ్యాయి. యూఎస్ వ్యాప్తంగా 378 లొకేషన్స్ లో 1035 ప్రీమియర్ షోలు ఈ సినిమాకి పడబోతున్నాయి. వీటిలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా చాలా తక్కువ టికెట్స్ అమ్ముడయ్యాయి. మూవీ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ టికెట్స్ ప్రీసేల్ పెరిగే అవకాశం ఉందని అనుకుంటున్నారు.

ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాలలో ‘పుష్ప 2’కి అత్యధిక ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ సినిమాకి యూఎస్ లో మొత్తం 904 లొకేషన్స్ లో 3446 ప్రీమియర్ షోలు వేశారు. ఈ మూవీ రిలీజ్ కి 12 రోజుల ముందు 46 వేల టికెట్లు బుక్ అయ్యాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాకి 1501 ప్రీమియర్ షోలు పడ్డాయి. 528 లొకేషన్స్ లో ఈ షోలు వేశారు.

రిలీజ్ కి 12 రోజుల ముందు 43.2 వేల టికెట్స్ ప్రీమియర్ షో టికెట్లు బుక్ అయ్యాయి. ఇక డార్లింగ్ ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ సినిమాకి 570 లొకేషన్స్ లో 2100 ప్రీమియర్ లు పడ్డాయి. అయితే ఈ చిత్రం రిలీజ్ కి 12 రోజుల ముందు 36 వేల టికెట్స్ మాత్రమే సేల్ అయ్యాయి. ఈ సినిమాల లైన్ అప్ చూసుకుంటే ‘పుష్ప 2’ టాప్ లో ఉండగా ‘దేవర’ రెండో స్థానంలో, ‘కల్కి’ మూడో స్థానంలో ఉన్నాయి. ‘గేమ్ చేంజర్’ ఆఖరులో ఉంది. ఇక ఈ సినిమాలకి ప్రీమియర్ షోల ద్వారా రిలీజ్ కి 12 రోజుల ముందు ఎంత కలెక్షన్స్ వచ్చాయో చూసుకుంటే ఇలా ఉన్నాయి.

దేవర - $1,345,082 | 528 లొకేషన్లు | 1501 షోలు | 43.2K టికెట్లు

పుష్ప 2 ది రూల్ - $1,310,178 | 904 లొకేషన్లు | 3446 షోలు | 46K టికెట్లు

కల్కి 2898ఏడీ - $1,156,622 | 570 లొకేషన్లు | 2100 షోలు | 36K టికెట్లు

గేమ్ చేంజర్ $317,629 | 378 లొకేషన్లు | 1035 షోలు | 11K టికెట్లు