Begin typing your search above and press return to search.

అమెరికాలో గేమ్ ఛేంజర్ పాట్లు.. ఏం జరిగిందంటే?

తాజాగా అమెరికన్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, కొన్ని ఊహించని పరిస్థితుల కారణంగా ప్రీమియర్ షోల సమయాల్లో జాప్యం జరిగే అవకాశముందట.

By:  Tupaki Desk   |   9 Jan 2025 11:39 AM IST
అమెరికాలో గేమ్ ఛేంజర్ పాట్లు.. ఏం జరిగిందంటే?
X

రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకున్న మేకర్స్ ప్రమోషన్ లో హడావుడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏరియాలకు తగ్గట్టుగా అవుట్ పుట్ సిద్ధం చేసి ఫైనల్ కాపీలను పంపిస్తున్నారు. నిజానికి గేమ్ ఛేంజర్ కు మొదట్లో ఉన్న నెగిటివ్ బజ్ మెల్లమెల్లగా తగ్గుతూ వస్తోంది.

అమెరికాలో కూడా సినిమా ఈవెంట్ కూడా మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక తెలంగాణలో ఉదయం 4 గంటల నుంచే షోలను ప్లాన్ చేయగా, అమెరికాలో ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలు జనవరి 9న ప్రారంభమవుతాయి. అయితే, తాజాగా అమెరికన్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, కొన్ని ఊహించని పరిస్థితుల కారణంగా ప్రీమియర్ షోల సమయాల్లో జాప్యం జరిగే అవకాశముందట.

అమెరికాలోని డిస్ట్రిబ్యూటర్లు ఇటీవల గేమ్ ఛేంజర్ తెలుగు కాపీ జనవరి 8న అందుకుని, అదే రోజు రాత్రికి అన్ని ఎలక్ట్రానిక్ డౌన్‌లోడ్ సైట్లకు పంపించారని తెలిపారు. ఇది ప్రదర్శనకు పెద్ద సమస్య కాకపోయినా, కొన్ని ప్రాంతాలలో భౌతికంగా కంటెంట్ డ్రైవ్స్ చేరడంలో జాప్యం జరుగుతోందట. దీనికి లాస్ ఏంజెలెస్ ప్రాంతంలో మంటలు, మధ్యప్రాంతాల్లో తుఫాను కారణమని వారు వివరించారు.

ముఖ్యంగా, కొన్ని హార్డ్ డ్రైవ్స్ కార్గో హబ్‌లలో నిలిచిపోవడంతో కొన్ని థియేటర్లకు మాత్రమే సమయానికి కంటెంట్ చేరనుంది. ఈ సమస్యను అధిగమించడానికి డిస్ట్రిబ్యూటర్లు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కొందరు ఫ్యాన్స్ తమ ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు రద్దవుతున్నాయంటూ సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, గేమ్ ఛేంజర్ టీమ్ ఇప్పటికే ప్రమోషన్స్ ద్వారా సినిమా పై భారీ అంచనాలు నెలకొల్పింది.

రామ్ చరణ్ పాన్ ఇండియా స్థాయిలో RRR తో మరింత క్రేజ్ అందుకున్న తర్వత చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో, ప్రేక్షకులు ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, ఎస్‌జే సూర్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇది బాలీవుడ్ మార్కెట్‌లకు చేరువవుతున్న తెలుగు సినిమాలకు మరింత ప్రాధాన్యత కల్పిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ముఖ్యంగా, శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ వీక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని టాక్ వినిపిస్తోంది. థమన్ సంగీతం కూడా సినిమాకు మరో హైలైట్‌గా నిలవనుంది. మరి ఈ జాప్యాలు ఎంతవరకు ప్రదర్శనపై ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. సినిమా రిలీజ్ బజ్ విషయంలో అభిమానుల్లో ఉన్న ఆసక్తి తగ్గకుండా ఉండేందుకు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు మరింత కృషి చేయాల్సిన పరిస్థితి ఉంది. మరి గేమ్ ఛేంజర్ ఈ పరిస్థితుల నడుమ ఎలాంటి ఫలితాన్ని అందికుంటుందో చూడాలి.