Begin typing your search above and press return to search.

గేమ్ చేంజర్ యూఎస్ ప్రీమియర్స్… ప్రీ సేల్స్ ఎలా ఉన్నాయి?

యూఎస్ లో తెలుగు సినిమాల ప్రీమియర్ షోల ప్రీసేల్ కి భారీ స్పందన వస్తుంది.

By:  Tupaki Desk   |   25 Dec 2024 7:01 AM GMT
గేమ్ చేంజర్ యూఎస్ ప్రీమియర్స్… ప్రీ సేల్స్ ఎలా ఉన్నాయి?
X

యూఎస్ లో టాలీవుడ్ సినిమాల ప్రీమియర్స్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పోటీగా బాలీవుడ్ సినిమాలు ఉన్నా కూడా మన హీరోలు గట్టిగానే డామినేట్ చేస్తున్నారు. ప్రీమియర్ షోల కోసం నెల రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నారు. యూఎస్ లో తెలుగు సినిమాల ప్రీమియర్ షోల ప్రీసేల్ కి భారీ స్పందన వస్తుంది. చాలా స్పీడ్ గా టికెట్లు అమ్ముడైపోతున్నాయి.

ఈ ఏడాది టాలీవుడ్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన స్టార్ హీరోల సినిమాలైనా ‘పుష్ప 2’, ‘దేవర’, ‘కల్కి 2898ఏడీ’ సినిమాల ప్రీమియర్ షోలకి నెల రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా వేలల్లో టికెట్లు సేల్ అయ్యాయి. ఇక సినిమాల రిలీజ్ కి రెండు వారాల సమయం ఉండగానే భారీగా టికెట్లు సేల్ కావడం విశేషం.

ఈ ఏడాది అత్యధిక ప్రీ సేల్ జరిగిన సినిమాల జాబితా చూసుకుంటే మొదటి స్థానంలో ‘పుష్ప 2’ ఉంది. ఈ సినిమా రిలీజ్ కి 16 రోజుల ముందు 34.7K టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ సినిమాకి యూఎస్ లో 844 లొకేషన్స్ 3233 ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ చిత్రం రిలీజ్ కి 16 రోజుల ముందే 963,192 డాలర్ల కలెక్షన్స్ ప్రీసేల్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి.

దీని తర్వాత ‘దేవర’ మూవీ రిలీజ్ కి 16 రోజుల ముందు 960,182 డాలర్లు కలెక్షన్స్ ని అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కలెక్ట్ చేసింది. ఏకంగా 32 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. టోటల్ గా యూఎస్ లో 376 లొకేషన్స్ లో 1121 ప్రీమియర్ షోలలో ఈ సినిమాని ప్రదర్శించారు. దీంతో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇదొక సరికొత్త రికార్డ్ గా నిలిచింది.

ఇక డార్లింగ్ ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 16 రోజుల ముందు 700,394 డాలర్లు వసూళ్లు చేసింది. 337 లొకేషన్స్ లో 1391 ప్రీమియర్ షోలు ఈ సినిమాకి పడ్డాయి. 22.7K టికెట్లు సేల్ అయ్యాయి.

సంక్రాంతి రేసులో రిలీజ్ కాబోతున్న ‘గేమ్ చేంజర్’ మూవీ ప్రీసేల్స్ కూడా యూఎస్ లో మొదలయ్యాయి. ఈ ఏకంగా 365 లొకేషన్స్ లో 995 ప్రీమియర్ షోలు ఈ సినిమాకి పడబోతున్నాయి. ఇప్పటి వరకు 8.9K టికెట్లు అమ్ముడయ్యాయి. మిగిలిన స్టార్ హీరోల సినిమాలతో పోల్చుకుంటే ‘గేమ్ చేంజర్’ ప్రీసేల్ బుకింగ్స్ తక్కువగానే ఉన్నాయి.

అయితే జనవరి ఫెస్టివల్ దగ్గరలో టికెట్ బుకింగ్స్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా ప్రీమియర్ షో టికెట్ బుకింగ్స్ పెరగొచ్చని అనుకుంటున్నారు. తప్పకుండా రామ్ చరణ్ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ రికార్డుని అందుకుంటుందని అనిపిస్తుంది. ఇప్పటికే టీజర్ మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక ట్రైలర్ అనంతరం అడ్వాన్స్ బుకింగ్స్ లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది.

పుష్ప 2: $963,192 - 844 లొకేషన్స్ - 3233 షోలు - 34.7K టికెట్లు

దేవర: $960,182 - 376 లొకేషన్స్ - 1121 షోలు - 32K టికెట్లు

కల్కి2898ఏడీ: $700,394 - 337 లొకేషన్స్ - 1391 షోలు - 22.7K టికెట్లు

గేమ్ చేంజర్: $250,604 - 365 లొకేషన్స్ - 995 షోలు - 8.9K టికెట్లు