Begin typing your search above and press return to search.

టాలీవుడ్ హ్యాపీ: ఏపీ ఓకే.. తెలంగాణ సంగ‌తేంటి?

దీంతో ఆయ‌న గేమ్ ఛేంజ‌ర్ విష‌యంలో ఎలా రియాక్ట్ అవుతారనే విష‌యంపై టాలీవుడ్ ఆస‌క్తిగా ఉంది.

By:  Tupaki Desk   |   4 Jan 2025 2:49 PM GMT
టాలీవుడ్ హ్యాపీ: ఏపీ ఓకే.. తెలంగాణ సంగ‌తేంటి?
X

టాలీవుడ్‌పై ఏపీ ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ నెల సంక్రాంతికి ముందు విడుద‌ల‌వుతున్న రామ్ చ‌ర‌ణ్ మూవీ `గేమ్ ఛేంజ‌ర్` విష‌యంలో బెనిఫిట్ షో, అద‌న‌పు టికెట్ ధ‌ర‌ల‌కు ప్ర‌భుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో గేమ్ ఛేంజ‌ర్ టీం హ్యాపీ అయింది. అయితే.. ఈ విష‌యంలో తెలంగాణ ప్ర‌బుత్వం ఇప్ప‌టికీ స్పందించ‌లేదు. త‌ను సీఎం సీటులో ఉండ‌గా టికెట్ ధ‌ర‌ల‌ను పెంచేది లేద‌ని.. ప్రీమియ‌ర్‌షోల‌కు అనుమ‌తి ఇచ్చేది లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. దీంతో ఆయ‌న గేమ్ ఛేంజ‌ర్ విష‌యంలో ఎలా రియాక్ట్ అవుతారనే విష‌యంపై టాలీవుడ్ ఆస‌క్తిగా ఉంది.

ఏపీలో ఇదీ వెసులుబాటు..

+ గేమ్ ఛేంజ‌ర్ సినిమా ఈ నెల 11న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో ఈ నెల 10న అర్థ‌రాత్రి 1 గంట‌ల‌కు, అనంత‌రం తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు కూడా సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌కు ఏపీ స‌ర్కారు అనుమ‌తి ఇచ్చింది.

+ అయితే.. ప్రీమియ‌ర్ షోల‌కు అనుమ‌తి ఇవ్వ‌లేదు.

+ టికెట్ ధ‌ర‌ల విష‌యంలో కూడా ఏపీ సర్కారు సానుకూలంగానే రియాక్ట్ అయింది.

+ బెనిఫిట్ షో టికెట్ ధ‌ర‌ను రూ.600గా నిర్ణ‌యించింది. ఇది అన్ని ర‌కాల ధియేట‌ర్ల‌కు కామ‌న్‌గా ఉంటుంది.

+ త‌ర్వాత నుంచి మాత్రం మ‌ల్టీప్లెక్సుల్లో రూ.175, సింగిల్ స్క్రీన్ ధియేట‌ర్లు రూ.135 చొప్పున టికెట్ ధ‌ర‌ల‌ను పెంచుకునేందుకు ఏపీ స‌ర్కారు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

+ అంతేకాదు.. ఈ ధ‌ర‌ల పెంపు ఈ నెల 11 నుంచి 23వ తేదీ వ‌ర‌కు అమ‌లు చేసేందుకు కూడా స‌ర్కారు ఓకే చెప్పింది.

+ సాధార‌ణంగా రోజుకు నాలుగు షోలు ప్ర‌ద‌ర్శిస్తుండ‌గా.. ఇప్పుడు 5 షోల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది.

రాజుగారి ఎఫెక్ట్ ఎంత‌?

ప్ర‌స్తుతం తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మ‌న్‌గా ఉన్న దిల్ రాజు.. గేమ్ ఛేంజ‌ర్ నిర్మాత అన్న విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న ఏమేర కు రాష్ట్ర స‌ర్కారు నుంచి ప్ర‌త్యేక షోలు, టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు సంబంధించి అనుమ‌తులు తెచ్చుకుంటార‌నే విష‌యంపై ఆస‌క్తిక ర చ‌ర్చ సాగుతోంది. ఇటీవ‌ల సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసిన‌ప్పుడు.. టికెట్ ధ‌ర‌ల పెంపు, ప్రీమియ‌ర్ షోల అంశం చిన్న‌దేన‌ని భావించిన ఆయ‌న‌.. ఇదే విష‌యాన్ని మీడియాకు సైతం చెప్పారు. ఇప్పుడు మ‌రో వారంలో తెర‌ముందుకు రానున్న గేమ్ ఛేంజ‌ర్ విష‌యంలోనూ లైట్ తీసుకుంటారా? లేక స‌ర్కారును ఒప్పిస్తారా? అనేది చూడాలి.