Begin typing your search above and press return to search.

'గేమ్ ఛేంజర్' కోసం రేవంత్ రెడ్డి?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా స్థాయిలో జనవరి 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

By:  Tupaki Desk   |   30 Dec 2024 7:19 AM GMT
గేమ్ ఛేంజర్ కోసం రేవంత్ రెడ్డి?
X

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.. బ్లాక్ బస్టర్ హిట్ ఆర్ఆర్ఆర్ తర్వాత సోలోగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా స్థాయిలో జనవరి 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా, తెలుగమ్మాయి అంజలి మరో ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఆ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సినిమా కోసం రూ.350 కోట్లు ఖర్చు పెట్టినట్టు టాక్ వినిపిస్తోంది.

అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న వేళ మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఇప్పటికే టీజర్ తో పాటు నాలుగు సాంగ్స్ ను విడుదల చేసిన మేకర్స్.. జనవరి 1వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు నిన్ననే దిల్ రాజు.. విజయవాడలో జరిగిన రామ్ చరణ్ భారీ కటౌట్ రివీల్ ఈవెంట్ లో మాట్లాడుతూ తెలిపారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన డేట్ బట్టి ఆంధ్రలో ఈవెంట్ నిర్వహిస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో జనవరి 1వ తేదీన ఈవెంట్ జరగడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని, అనుమతులు తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అయితే ఆ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం విజయవాడలో ఉన్న దిల్ రాజు.. హైదరాబాద్ వచ్చాక రేవంత్ ను ఇన్వైట్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. కాగా, ఇటీవల దిల్ రాజుకు రేవంత్ రెడ్డి సర్కార్.. ప్రతిష్ఠాత్మకమైన పదవిని కట్టబెట్టింది.

తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ (టీఎఫ్ డీసీ) ఛైర్మన్ గా ఇటీవల దిల్ రాజు బాధ్యతలు కూడా స్వీకరించారు. ఆ తర్వాత దిల్‌ రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇరువైపులా పలు ప్రతిపాదనలు ప్రవేశపెట్టారు. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి అతిథిగా వచ్చి.. వేదికపై ఏం మాట్లాడుతారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది!