పుష్ప-2 స్ట్రాటజీతో గేమ్ ఛేంజర్ !
మరి ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇదే స్ట్రాటజీతో నార్త్ ఆడియన్స్ ముందుకు వెళ్లబోతున్నాడా? అంటే అవుననే లీకులందుతున్నాయి.
By: Tupaki Desk | 18 Dec 2024 11:08 AM GMTపాన్ ఇండియాలో `పుష్ప-2` ప్రచారం ఏ రేంజ్ లో నిర్వహించారో తెలిసిందే. ఒక్క బీహార్ ఈవెంట్ తోనే దశం దద్దరిల్లింది. ఈ వెంట్ జరుగుతున్నంత సేపు ఉత్తరాదిన జరుగుతుందా? తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుందా? అన్న సందేహం వచ్చింది. `పుష్ప ది రైజ్` తో బన్నీ నార్త్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవ్వడంతోనే ఆ రేంజ్ లో ఈవెంట్ సక్సెస్ అయింది. అటుపై ముంబై, బెంగుళూరు, చెన్నైలో నిర్వహించిన ఈవెంట్లు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి.
ప్రచారం పరంగా ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా పక్కాగా ప్లాన్ చేసుకుని ముందుకెళ్లడంతోనే గ్రాండ్ సక్సస్ అయ్యారు. సినిమాకి భారీ ఎత్తున ఓపెనింగ్స్ సాధించడంలో ఆ రకమైన ప్రచారం కీలక పాత్ర పోషించింది అన్నది వాస్తవం. బాలీవుడ్ హీరోలెవరు నేరుగా ఆడియన్స్ ముందుకెళ్లరు. తొలిసారి బన్నీ అలా వెళ్లే సరికి ఎక్కడ లేని క్రేజ్ తోడైంది. అందుకే ఖాన్ లు..కపూర్ తొలి రోజే కాదు...మొత్తం అన్ని రకాల రికార్డులను తిరగరాసాడు వైల్డ్ ఫైర్ పుష్పరాజ్.
మరి ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇదే స్ట్రాటజీతో నార్త్ ఆడియన్స్ ముందుకు వెళ్లబోతున్నాడా? అంటే అవుననే లీకులందుతున్నాయి. సంక్రాంతి కానుకగా `గేమ్ ఛేంజర్` జనవరి 10న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడిగా శంకర్ తాను చేయాల్సిన పని పూర్తయింది. ఇక సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడమే మిగిలి ఉంది. గతం తరహాలో ఇప్పుడు సినిమాని ప్రమోట్ చేసి వదిలేస్తే సరిపోదు.
ప్రేక్షకుల్లోకి కంటెంట్ బలంగా వెళ్లాలంటే అంతకు ముందు హీరో సహా మేకర్స్ జనాల్లోకి వెళ్లాలి. ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ టీమ్ అంతా నార్త్ లో ఈవెంట్లు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారుట. రిలీజ్ సమయం కూడా దగ్గర పడటంతో ఈనెల 25 తర్వాత ఉత్తరాదిన రెండు రాష్ట్రాల రాజధాని ప్రాంతంలో అభిమానులతో ఇంటరాక్ట్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారుట. నేరుగా జనాల్లోకి వెళ్లకుండా ఓ పెద్ద స్టార్ హోటల్ లో భారీ ఎత్తున అభిమానుల్ని ఆహ్వనించి చిన్న పాటి వేడుక చేసి మీడియా ఇంటరాక్షన్ పెట్టాలని భావిస్తున్నారట.