గేమ్ చేంజర్… నెక్స్ట్ లెవల్ ప్లాన్స్
ఇదిలా ఉంటే జనవరి 2 సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ ని రాజమౌళి లాంచ్ చేయబోతున్నారు ట్రైలర్ రిలీజ్ తర్వాత మూవీ పైన హైప్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
By: Tupaki Desk | 2 Jan 2025 11:00 AM GMTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ మూవీ జనవరి 10న థియేటర్స్ లోకి వస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ నుంచి పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోన్న చిత్రం ఇదే కావడంతో మెగా ఫ్యాన్స్ ఈ చిత్రంపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. కచ్చితంగా ఈ సినిమాతో రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుంటున్నారు. అయితే రిలీజ్ కి ఇంకా 8 రోజుల సమయం మాత్రమే ఉన్న ‘గేమ్ చేంజర్’ మూవీ సౌండ్ పెద్దగా వినిపించడం లేదు.
‘పుష్ప 2’ రేంజ్ లో ఈ సినిమా కూడా దేశ వ్యాప్తంగా సౌండ్ క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ హిట్ అయిన సినిమాకి హైప్ తీసుకురాలేదు. ఇదిలా ఉంటే జనవరి 2 సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ ని రాజమౌళి లాంచ్ చేయబోతున్నారు ట్రైలర్ రిలీజ్ తర్వాత మూవీ పైన హైప్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
రెగ్యులర్ గా పోస్టర్స్ రిలీజ్ చేస్తున్న శంకర్ స్టైల్ మాత్రం ప్రేక్షకులకి ఇంకా రీచ్ కాలేదు. అయితే తాజాగా అతని విజన్ నుంచి వచ్చిన పోస్టర్ లుక్ అందరిని ఎట్రాక్ట్ చేస్తోంది. సోషల్ డ్రామాని ప్రెజెంట్ చేయడంలో శంకర్ ఎక్స్ పర్ట్ అనే సంగతి అందరికి తెలిసిందే. సమాజంలో జరిగే రాజకీయ, సామాజిక అంశాలని శంకర్ తనదైన శైలిలో ఎత్తి చూపిస్తూ ప్రజలకి తెలియజేస్తారు.
అందుకే శంకర్ సినిమాలకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ‘గేమ్ చేంజర్’ కూడా అలాంటి సోషల్ డ్రామాతోనే వస్తోంది. ఇక మూవీ ప్రమోషన్స్ ని నిర్మాత దిల్ రాజు స్పీడ్ అప్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజమౌళి హ్యాండ్ పడితే సినిమాకి పాన్ ఇండియా రేంజ్ లో ఎంతో కొంత బజ్ వస్తుంది. ఆ తరువాత జనవరి 4న ముంబైలో ఒక ఈవెంట్ నిర్వహించబోతున్నారు.
అదే రోజు రాజమండ్రిలో ప్రీరిలీజ్ ఈవెంట్ ఎనౌన్స్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. పవన్ రాకతో మూవీకి మరింత హైప్ రావడం ఖాయం అనుకుంటున్నారు. దీని తర్వాత చెన్నైలో ఒక మెగా ఈవెంట్ ప్లాన్ చేసారంట.
ఈ ఈవెంట్ కి సూపర్ స్టార్ రజినీకాంత్ లేదంటే ఇళయదళపతి విజయ్ లలో ఒకరు వస్తారని అనుకుంటున్నారు. నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ శంకర్ కి ఈ ఇద్దరు స్టార్స్ తో మంచి బాండింగ్ ఉంది. ఈ నేపథ్యంలో వారుకచ్చితంగా వస్తారని అనుకుంటున్నారు. శంకర్ ఇమేజ్ కోలీవుడ్ లో ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు. మరి ఈ ప్రమోషన్ యాక్టివిటీస్ తో సినిమాని పబ్లిక్ కి ఏ మేరకు చేరువ చేస్తారనేది చూడాలి.