'రా మచ్చా మచ్చా'తో చరణ్ రచ్చ రచ్చ!.. స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే?
గేమ్ ఛేంజర్ షూటింగ్ దాదాపు పూర్తి అవ్వగా.. ప్రస్తుతం మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుతున్నారు.
By: Tupaki Desk | 30 Sep 2024 4:46 PM GMTటాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, తెలుగు అమ్మాయి అంజలి ఫిమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. తమిళ నటుడు ఎస్ జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. గేమ్ ఛేంజర్ షూటింగ్ దాదాపు పూర్తి అవ్వగా.. ప్రస్తుతం మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుతున్నారు.
క్రిస్మస్ కానుకగా గేమ్ ఛేంజర్ సినిమాను రిలీజ్ చేస్తామని ఇప్పటికే ఇన్ డైరెక్ట్ గా చెప్పిన మేకర్స్.. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. మూవీ నుంచి ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న సెకండ్ సింగిల్ రా మచ్చా మచ్చా ప్రోమో నెట్టింట వైరల్ అవుతుండగా.. తాజాగా లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆ సాంగ్ కు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. ఎస్ ఎస్ తమన్ బాణీలు కట్టారు. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేయగా.. నకాల్ అజీజ్ అద్భుతంగా పాడారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్న రా మచ్చా మచ్చా సాంగ్.. మాస్ బీట్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. అంతా అంచనా వేసినట్లు ఇన్ స్టంట్ హిట్ గా నిలిచింది. రామ్ చరణ్ స్టైలిష్ అండ్ గ్రేస్ ఫుల్ స్టెప్పులతో అదరగొట్టారు. ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేశారు. చెర్రీ అద్భుతమైన స్టెప్పులతో ఆడియన్స్ కు సాంగ్ రూపంలో మేకర్స్ మంచి ట్రీట్ ఇవ్వడం పక్కా అని తెలుస్తోంది. మెగా అభిమానులకు థియేటర్లలో పూనకాలు రానున్నట్లు క్లియర్ గా అర్థమవుతుంది.
ముఖ్యంగా సాంగ్ లో చరణ్ వీణ స్టెప్, మెగాస్టార్ చిరంజీవి భారీ కటౌట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. చరణ్ తో పాటు వేలాది మంది జానపద కళాకారులు బ్యాక్ గ్రౌండ్ లో కనిపించారు. ఏపీ, ఒరిస్సా, కర్ణాటక, బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వెయ్యి మంది జానపద కళాకారులు పాటలో భాగమయ్యారు. ఆయా రాష్ట్రాలకు చెందిన జానపద సంస్కృతులను సాంగ్ లో జోడించామని శంకర్, తమన్.. రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ వీడియోలో చెప్పిన సంగతి తెలిసిందే.
ఇక సినిమా విషయానికొస్తే.. రామ్ చరణ్ తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ సంస్థల బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. డిసెంబర్ 20వ తేదీన మూవీని రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరి గేమ్ ఛేంజర్ చిత్రం ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.