Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్: అక్కడ ఆల్ టైమ్ రికార్డ్

రిలీజ్ రోజునే ఈ సినిమా రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక షోలు, మల్టీప్లెక్స్ బుకింగ్స్‌తో గేమ్ ఛేంజర్ దుమ్ము రేపింది.

By:  Tupaki Desk   |   10 Jan 2025 11:15 AM GMT
గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్: అక్కడ ఆల్ టైమ్ రికార్డ్
X

రిలీజ్ కు ముందు మంచి హైప్ క్రియేట్ చేసుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ శుక్రవారం గ్రాండ్‌గా విడుదలైంది. మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 6000కి పైగా థియేటర్లలో విడుదలైంది. మావెరిక్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా ఫ్యాన్స్‌తో పాటు పాన్ ఇండియా స్థాయిలో సినిమా ప్రీమియర్ షోలకు విశేష స్పందన లభించింది.

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటించగా, ప్రతినాయకుడిగా ఎస్.జె.సూర్య కనిపించారు. కియారా అందంతో పాటు హావభావాలు ఆకట్టుకోగా, సూర్య తన నటనతో కీలక పాత్రకు న్యాయం చేశారు. ఈ సినిమా దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. అయితే సినిమా అనుకున్నంతగా పాజిటివ్ రివ్యూలు అందుకోలేకపోయింది

ఇక టాక్ సంగతి పక్కన పెడితే.. రిలీజ్ రోజునే ఈ సినిమా రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక షోలు, మల్టీప్లెక్స్ బుకింగ్స్‌తో గేమ్ ఛేంజర్ దుమ్ము రేపింది. నెల్లూరు సిటీలో అయితే ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. తొలి రోజు 103 షోలకు గాను అడ్వాన్స్ బుకింగ్స్ తో ఏకంగా రూ.1.15 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇది నెల్లూరు సిటీలో ఇప్పటి వరకు అందుకున్న అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్‌గా నిలిచింది.

RRR తరువాత రామ్ చరణ్ నుంచి వచ్చిన సోలో పాన్ ఇండియా సినిమా కావడంతో సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా ప్రమోషన్స్ విషయంలో నిర్మాత దిల్ రాజు చేసిన ప్లాన్ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. ఇక సినిమా రిలీజ్ అనంతరం ఫైనల్ టాక్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది రెండవ రోజు తెలుస్తుంది. ఫస్ట్ డే అయితే చరణ్ కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్ అందుకునే అవకాశాలు ఉన్నాయి.

సినిమాలో చరణ్ అప్పన్న క్యారెక్టర్ ఎక్కువగా హైలెట్ అయ్యింది. ఆ పాత్ర స్క్రీన్ టైమ్ ఇంకాస్త ఎక్కువగా ఉంటే బాగుండేది అనేలా కామెంట్స్ వచ్చాయి. అలాగే చరణ్ ఫైట్స్, డాన్స్ అంజలి ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ అవుతోంది. మరి గేమ్ ఛేంజర్ ఫస్ట్ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్లు అందుకుంటుందో చూడాలి.