Begin typing your search above and press return to search.

ఇక చరణ్ పండక్కే..

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ 2025 సంక్రాంతికి రిలీజ్ కాబోతోందనే మాట వినిపిస్తోంది. జనవరి 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారంట.

By:  Tupaki Desk   |   11 Oct 2024 7:39 AM GMT
ఇక చరణ్ పండక్కే..
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' మూవీ స్టార్ట్ అయ్యి మూడేళ్లు అవుతుంది. శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ తో చరణ్ మూవీ చేస్తున్నాడనేసరికి ఈ చిత్రంపై ఆరంభంలో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే శంకర్ గేమ్ చేంజర్ షూటింగ్ జరుగుతూ ఉండగానే ఇండియన్ 2 కూడా తిరిగి మొదలు పెట్టాడు. ఈ రెండు సినిమాలు షూటింగ్ ఒకదాటి తర్వాత ఒకటి చేస్తూ వచ్చారు. దీంతో మూవీ కంప్లీట్ కావడానికి మూడేళ్ళు పట్టింది.

ఈ లోపు 'గేమ్ చేంజర్' సినిమాపై ఉన్న బజ్ మొత్తం తగ్గిపోయింది. ప్రస్తుతం ఈ సినిమాపై పబ్లిక్ అటెన్షన్ పెద్దగా లేదు. మెగా ఫ్యాన్స్ మాత్రమే ఈ సినిమాపై కొంత హోప్ పెట్టుకున్నారు. 'ఆర్ఆర్ఆర్' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ నుంచి పాన్ ఇండియా రేంజ్ లో 'గేమ్ చేంజర్' మూవీ వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో చరణ్ మార్కెట్ పెరగాలంటే కచ్చితంగా ఈ మూవీతో సక్సెస్ అందుకోవాల్సిందే.

ఈ సినిమాని డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తామని దిల్ రాజు ప్రకటించాడు. కాని ఇప్పటి వరకు సినిమాపై ఆశించిన స్థాయిలో హైప్ క్రియేట్ చేయలేకపోయారు. మూవీ నుంచి వచ్చిన రెండు సాంగ్స్ కూడా సినిమాకి పెద్దగా బూస్టింగ్ ఇవ్వలేదని చెప్పాలి. దసరాకి టీజర్ వస్తుందని ఆశించారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న గేమ్ చేంజర్ టీజర్ కట్ చేయలేదని టాక్. సాంగ్స్ మాత్రం రిలీజ్ చేసే ఛాన్స్ ఉందంట.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ 2025 సంక్రాంతికి రిలీజ్ కాబోతోందనే మాట వినిపిస్తోంది. జనవరి 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారంట. నిజానికి మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' జనవరి 10న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే 'గేమ్ చేంజర్' విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ లేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే 'విశ్వంభర' మూవీ సమ్మర్ కి వాయిదా పడిందని టాక్ వినిపిస్తోంది.

ఈ నేపథ్యం లోనే 'గేమ్ చేంజర్' ని దిల్ రాజు సంక్రాంతికి కన్ఫర్మ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. జనవరి 9న యూఎస్ లో ప్రీమియర్స్ వేయబోతున్నారంట. తక్కువ బజ్ ఉన్న సినిమాలకి మంచి కలెక్షన్స్ రావాలంటే సంక్రాంతి సీజన్ బెస్ట్ అనే టాక్ నడుస్తోంది. అందుకే దిల్ రాజు కూడా గేమ్ చేంజర్ ని సంక్రాంతికి షిఫ్ట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అయితే దిల్ రాజు బ్యానర్ లో వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ కూడా ఫెస్టివల్ రిలీజ్ కన్ఫర్మ్ అయ్యింది. ఆ సినిమా రిలీజ్ విషయంలో దిల్ రాజు ఏమైనా తన నిర్ణయం మార్చుకుంటాడా అనేది వేచి చూడాలి.