'గేమ్ ఛేంజర్' సెన్సార్, ట్రైలర్ రన్ టైమ్ ఇలా!
ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయినట్లు సెన్సార్ టాక్ బయటకొస్తుంది. సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని అంటున్నారు.
By: Tupaki Desk | 31 Dec 2024 7:14 AM GMT'గేమ్ ఛేంజర్' పాన్ ఇండియా రిలీజ్ కి కౌంట్ డౌన్ మొదలైంది. ఇంకా పది రోజుల్లో చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జవనరి 10న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయి? అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే టీజర్, ఫస్ట్ లుక్, లిరికల్ సింగిల్స్ తో ఓ రేంజ్ లో పాపు లర్ అయింది. దీంతో ట్రైలర్ ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్నారు.
కొత్త ఏడాదిని పురస్కరించుకుని జనవరి 4న ట్రైలర్ రిలీజ్ అవుతుంది. తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. సినిమాకు సంబంధించిన కీలకమైన సెన్సార్ పనులు పూర్తి చేసుకుందిట. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయినట్లు సెన్సార్ టాక్ బయటకొస్తుంది. సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని అంటున్నారు. ఇక ద్వితియార్ధం సినిమాని శంకర్ పరుగులు పెట్టించినట్లు వినిపిస్తుంది.
ప్రేక్షకుడిని సీట్ ఎడ్జున కూర్చోబెట్టడం ఖాయమంటున్నారు. సినిమా రన్ టైమ్ మొత్తం 2 గంటల 45నిమిషాలతో లాక్ అయిందిట. సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ వచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించి మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అలాగే ట్రైలర్ కి సంబంధించిన సమాచారం కూడా బయటకు వచ్చింది. ట్రైలర్ కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు.
తాజాగాట్రైలర్ ని రెండు నిమిషాల 20 నిమిషాలకు మించి కట్ చేసినట్లు తెలుస్తోంది. అదిరిపోయే బీజీఎమ్ తో రామ్ చరణ్-సూర్య ఎస్ జే పాత్రల్ని ఓ రేంజ్ లోనే ట్రైలర్ లోనే హైలైట్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. చరణ్-సూర్య ముఖా ముఖి డైలాగులు ఒళ్లు జలదరించేలా పేల బోతున్నాయట. ఇద్దరి మధ్య నువ్వా? నేనా? అన్న రేంజ్ లో సంభాషణలు సాగుతాయని అంటున్నారు. ట్రైలర్ తోనే బొమ్మ పై హిట్ నమ్మకం అభిమానుల్లో మరింత రెట్టింపు చేస్తుందంటున్నారు.