Begin typing your search above and press return to search.

ఆ విష‌యంలో రాజుగారికి మాత్ర‌మే శంక‌ర్ యాక్సెస్!

ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం శంక‌ర్ రాజుగారికి స్టోరీ చెప్పారు.

By:  Tupaki Desk   |   7 Jan 2025 8:30 PM GMT
ఆ విష‌యంలో రాజుగారికి మాత్ర‌మే శంక‌ర్ యాక్సెస్!
X

శంక‌ర్ ఓ ప్రాజెక్ట్ టేక‌ప్ చేసాడంటే? అందులో ఎలాంటి మార్పులుండ‌వు. ప‌క్కా ప్లానింగ్ తో బ‌రిలోకి దిగుతారు. ముఖ్యంగా స్క్రిప్ట్ విష‌యంలో ఓ క్లారిటీతో సెట్స్ కి వెళ్తారు. సెట్స్ కి వెళ్లిన త‌ర్వాత మార్చ‌డాలు...మ‌ధ్య‌లో సీన్స్ రాయించ‌డాలు వంటివి ఉండ‌వు. అందులో ఇంకెవ్వ‌రు ఇన్వాల్వ్ అవ్వ‌డానికి కూడా ఛాన్స్ ఉండ‌దు. హీరోలు, నిర్మాత‌లు, ర‌చ‌యిత‌లు ఇలా అంతా శంక‌ర్ చెప్పిన‌ట్లు చేయాల్సిందే త‌ప్ప శంక‌ర్ కి ఎవ‌రూ స‌ల‌హాలు ఇచ్చే సీన్ ఉండ‌దు.

ఇప్ప‌టి వ‌ర‌కూ శంక‌ర్ అలాగే సినిమాలు చేసుకుంటూ వ‌చ్చారు. వాటిలో కొన్ని మంచి విజ‌యం సాధిస్తే కొన్ని వైఫ‌ల్యం అయ్యాయి. ప్లాప్ సినిమాలు వ‌చ్చాయ‌ని శంక‌ర్ ఇమేజ్ ఎక్క‌డా త‌గ్గ‌లేదు. శంక‌ర్ తో ఏ హీరో సినిమా చేసినా ఓ గొప్ప గౌర‌వంగా భావిస్తారు. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ తో 'గేమ్ ఛేంజ‌ర్' తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం శంక‌ర్ రాజుగారికి స్టోరీ చెప్పారు.

అప్పుడేం చెప్పారు సినిమా ప్రారంభ‌మైన త‌ర్వాత కూడా అదే తీసిన‌ట్లు రాజుగారు రివీల్ చేసారు. ఈ విషయంలో తానెప్పుడు ఫాలోఅప్ లో ఉండేవాడిన‌న్నారు. అదేంటి? శంక‌ర్ ని ఫాలో చేయ‌డం ఏంటి? ఆయ‌న ఎవ‌ర్నీ ఇన్వాల్వ్ చేయ‌రు క‌దా? అనుకుంటున్నారు. అదే మ‌రి రాజుగారు అంటే. స్టోరీ విష‌యంలో శంక‌ర్ రాజుగారు చెప్పింది చెప్పి న‌ట్లే తీసారుట‌. స్టోరీలో ఎలాంటి మార్పులు లేవన్నారు. హీరో కానీ, నిర్మాత కానీ వేలు పెట్ట‌డానికి లేక‌పోయినా? తాను మాత్రం ద‌గ్గ‌రుండి అన్నీ చూసుకున్న‌ట్లు చెప్ప‌క‌నే చెప్పారు.

అంటే శంక‌ర్ అక్క‌డ రాజుగారికి ఓ యాక్సెస్ క‌ల్పించిన‌ట్లు అయింది. శంక‌ర్ కూడా రాజుగారి గురించి ఓ మాట అన్నారు. సాధార‌ణంగా నిర్మాత‌లంటే సెట్స్ కి రారు. కానీ రాజుగారు మాత్రం వ‌చ్చి అన్ని డిపార్ట్ మెంట్ ల‌ను అలెర్ట్ చేసి ప‌నులు చేయిస్తార‌ని, ద‌గ్గ‌రుండి అన్నిచూసుకుంటార‌న్నారు. ఇంత వ‌ర‌కూ తాను అలాంటి నిర్మాత‌ను చూడ‌లేద‌ని శంక‌ర్ అన్నారు. అదే రాజుగారు అంటే మ‌రి.