గేమ్ ఛేంజర్ సాంగ్స్.. మగధీర బడ్జెట్ కంటే ఎక్కువే..
అయితే శంకర్ సినిమాలంటే చాలు.. అందరూ సాంగ్స్ కచ్చితంగా స్పెషల్ గా ఉంటాయని ఫిక్స్ అయిపోతారు. గ్రాండ్ విజువల్స్, అదిరిపోయే సెట్స్ లో సాంగ్స్ ను షూట్ చేస్తూంటారాయన.
By: Tupaki Desk | 30 Dec 2024 5:07 AM GMTటాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తో కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ గేమ్ ఛేంజర్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమా.. సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. జనవరి 10వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలో సందడి చేయనుంది గేమ్ ఛేంజర్.
అయితే శంకర్ సినిమాలంటే చాలు.. అందరూ సాంగ్స్ కచ్చితంగా స్పెషల్ గా ఉంటాయని ఫిక్స్ అయిపోతారు. గ్రాండ్ విజువల్స్, అదిరిపోయే సెట్స్ లో సాంగ్స్ ను షూట్ చేస్తూంటారాయన. అదే సమయంలో ఖర్చు కూడా భారీగానే నిర్మాతలతో పెట్టిస్తారు. అందుకు తగ్గట్లే సాంగ్స్ ఉండి ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటాయి.
ఇప్పుడు గేమ్ ఛేంజర్ లో ఐదు సాంగ్స్ ఉండగా.. వాటికి భారీగా ఖర్చు అయినట్టు తెలుస్తోంది. సినిమా మొత్తం రూ.350 కోట్లతో రూపొందగా.. సాంగ్స్ కు గాను ఊహించని రేంజ్ లో ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా మగధీర బడ్జెట్ కంటే ఎక్కువే అయినట్లు తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర అప్పట్లో అదే హయ్యెస్ట్ బడ్జెట్. దాదాపు 40 కోట్ల రేంజ్ లో ఖర్చు చేశారు.
ఇక మగధీరకు మంచి లాభాలే వచ్చాయి. అయితే ఇప్పుడు గేమ్ ఛేంజర్ సాంగ్స్ కోసం అంతకుమించి ఖర్చు చేయడం షాకింగ్. కేవలం సాంగ్స్ కోసమే రూ.75 కోట్లు ఖర్చు పెట్టినట్టు సమాచారం. దీంతో అంత ఖర్చు పెట్టారా అని కొందరు నెటిజన్లు అంటుండగా.. శంకర్ కదా ఆ మాత్రం ఉండాలని మరికొందరు చెబుతున్నారు. గేమ్ ఛేంజర్ పాటల కోసం భారీ సెట్లు, కొత్త టెక్నాలజీ, అనేక మంది బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్లు, వేరే లెవెల్ లొకేషన్లను మేకర్స్ ఉపయోగించినట్లు తెలుస్తోంది.
ఆ విషయం ఇప్పటికే వచ్చిన సాంగ్స్ ద్వారా అర్థమవుతోంది. ఇప్పటి వరకు మేకర్స్... జరగండి, రా మచ్చా మచ్చా, నానా హైరానా, దోప్ లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేశారు. జరగండి పాట కోసం అతి భారీ సెట్ వేసి సుమారు 600 మంది డ్యాన్సర్లతో సాంగ్ షూట్ చేసినట్లు క్లియర్ గా తెలుస్తోంది. 13 రోజుల పాటు ఆ సాంగ్ షూటింగ్ జరిగింది. ఆ తర్వాత వచ్చిన రా మచ్చా మచ్చా సాంగ్ కోసం 1,000 మంది జానపద కళాకారులను తీసుకొచ్చారు మేకర్స్. వివిధ కళలకు నివాళులు అర్పించారు.
నానా హైరానా సాంగ్ ను న్యూజిలాండ్ లో షూట్ చేయగా.. ఇన్ ఫ్రారెడ్ కెమెరాలు వినియోగించారు. ఆ కెమెరాలతో చిత్రీకరించిన మొదటి భారతీయ పాటగా నానా హైరానా నిలిచిన విషయం తెలిసిందే. ఇక డోప్ పాట కోసం మేకర్స్ భారీ సెట్ వేసి.. 100 మంది రష్యన్ డ్యాన్సర్లతో షూట్ చేశారు. గోదావరి బ్యాక్ డ్రాప్ లో రిచ్ గా షూట్ చేసిన ఐదవ సాంగ్ రిలీజ్ కావాల్సి ఉంది. అలా శంకర్ తన మార్క్ చూపించేలా సాంగ్స్ ను ఓ రేంజ్ లో చిత్రీకరించారనే చెప్పాలి. అందుకే రూ.75 కోట్లు ఖర్చు అయినట్లు ఉంది!