దిల్లీ పిల్లలకోసం గేమ్ చేంజర్ స్పెషల్ షో
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త సంవత్సరం భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.
By: Tupaki Desk | 13 Jan 2025 8:59 PM GMTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త సంవత్సరం భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజకీయ యాక్షన్ డ్రామా గేమ్ చేంజర్ 6000కి పైగా థియేటర్స్ లలో విడుదలైంది. ఈ సినిమా విడుదలైన కొన్ని రోజులకే రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్‌గా నిలిచింది.
ఇక సినిమాపై ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్‌ను మరింత ప్రత్యేకం చేసేందుకు, ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా తన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. "గాడ్స్ స్పెషల్ ఏంజెల్స్" పేరుతో బోధన అవసరాలు ఉన్న చిన్నారులను గేమ్ చేంజర్ సినిమా వీక్షించేందుకు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమం ఆ పిల్లలకు చాలా ఆనందాన్ని కలిగించింది.
సోషల్ మీడియా వేదికగా వీరేంద్ర సచ్దేవా ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక మూమెంట్స్ ను షేర్ చేశారు. ‘‘నా పుట్టినరోజును దేవుని ప్రత్యేకమైన ఆంజెల్స్‌తో జరుపుకోవడం జీవితాంతం మర్చిపోలేని అనుభవం. పెద్ద తెరపై రామ్ చరణ్, కియారా అద్వానీ నటనను వీక్షించేందుకు వారి ఆనందం అద్భుతంగా అనిపించింది’’ అని ఆయన ట్విటర్ ద్వారా తెలియజేశారు.
గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ గట్టి కథా బలం ఉన్న పాత్రలో కనిపించారు. ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలను ప్రతిబింబించేలా ఆయన పాత్రను శంకర్ ఎంతో శక్తివంతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమా సంభాషణలు, యాక్షన్ సీక్వెన్సులు, భారీ నిర్మాణ విలువలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కియారా అద్వానీ, ఎస్‌జే సూర్య, అంజలి తదితర నటులు తమ పాత్రలకు ప్రాణం పోశారు.
గేమ్ చేంజర్ ఈ సంక్రాంతికి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలై మంచి ఓపెనింగ్స్ అందుకుంది. నిర్మాత దిల్ రాజు, శిరీష్ ఎంతో శ్రద్ధతో రూపొందించిన ఈ చిత్రం, రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌కు న్యాయం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వెండితెరపై వచ్చే ప్రతీ క్షణం ప్రేక్షకుల మనసును గెలుచుకుంటూ పెద్ద విజయాన్ని సాధిస్తోంది.
ఇక ఈ కార్యక్రమం ప్రత్యేకతను సృష్టించడంతో పాటు, ఈ సినిమాలోని సామాజికతను కూడా గుర్తు చేసింది. రామ్ చరణ్ సినిమాలు ప్రేక్షకులకు వినోదంతో పాటు మంచి సందేశాలు అందిస్తాయని మరోసారి రుజువైంది. గేమ్ చేంజర్ సినిమా బెస్ట్ ఓపెనింగ్స్ తో రామ్ చరణ్ తన స్టార్‌డమ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారని చెప్పవచ్చు.