Begin typing your search above and press return to search.

గేమ్ చేంజర్.. తమిళ్ టార్గెట్ ఎంత?

నెక్స్ట్ సినిమా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే వరకు ప్రతి వారం ఒక ఈవెంట్ నిర్వహించడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   22 Dec 2024 6:30 AM GMT
గేమ్ చేంజర్.. తమిళ్ టార్గెట్ ఎంత?
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' మూవీ జనవరి 10న థియేటర్స్ లోకి వస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ తాజాగా యూఎస్ లో జరిగింది. మేకర్స్ ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఇండియన్ కాలమానం ప్రకారం ఈ రోజు ఉదయం ఈవెంట్ జరిగింది. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ తో మూవీ ప్రమోషన్స్ ని దిల్ రాజు స్టార్ట్ చేశారు. నెక్స్ట్ సినిమా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే వరకు ప్రతి వారం ఒక ఈవెంట్ నిర్వహించడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

మరో వైపు ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమా తమిళనాడు రిలీజ్ డీల్స్ క్లోజ్ అయ్యాయి. అక్కడ 15 కోట్లకి 'గేమ్ చేంజర్' రైట్స్ సోల్డ్ అయినట్లు సమాచారం. కోలీవుడ్ లో శంకర్ నెంబర్ వన్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆయన సినిమాలకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అలాగే 'ఆర్ఆర్ఆర్' తో రామ్ చరణ్ కి కూడా తమిళనాట కొంత హైప్ వచ్చింది.

ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ మూవీపైన జరిగిన బిజినెస్ కు 15 కోట్ల షేర్ అందుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదనే మాట వినిపిస్తోంది. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప 2' తమిళనాడులో 50 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించాయి. 'గేమ్ చేంజర్' బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే 35 కోట్ల వరకు గ్రాస్ మాత్రమే వసూళ్లు చేయాల్సి ఉంటుందంట. ఫెస్టివల్ కానుకగా ఈ సినిమా వస్తోన్న నేపథ్యంలో కచ్చితంగా ఆడియన్స్ రెస్పాన్స్ బాగుంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

అయితే అదే టైంలో అజిత్ 'విడాముయార్చి' మూవీ రిలీజ్ అవుతోంది. కోలీవుడ్ లో స్టార్ హీరోగా అజిత్ కి మంచి ఇమేజ్ ఉంది. ఆయన సినిమాలని అక్కడి ఆడియన్స్ విపరీతంగా చూస్తారు. ఈ నేపథ్యంలో 'గేమ్ చేంజర్' కి పోటీ గట్టిగానే ఉండబోతోంది. అయితే శంకర్ ఇమేజ్ తమిళనాట ఈ సినిమాకి కొంత కలిసొస్తుందని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే తెలుగు నాట మెగా ఫ్యాన్స్ ఈ చిత్రంపై చాలా హోప్స్ పెట్టుకున్నారు.

'పుష్ప 2' తరహాలో ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబడితే చూడాలని అనుకుంటున్నారు. సోషల్ డ్రామాతో తెరకెక్కిన ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులని ఎంగేజ్ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో చరణ్ కి జోడీగా కియారా అద్వానీ, అంజలి నటించారు. ఎస్ జె సూర్య ప్రతినాయకుడిగా కనిపిస్తున్నాడు. శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.