Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్.. మళ్ళీ అదే దెబ్బ!

కానీ ఈ పాన్ ఇండియా మూవీ విడుదలైన రోజు నుంచే పైరసీ దెబ్బ తగిలింది. ఆన్లైన్‌లో ఫుల్ క్లారిటీ ప్రింట్ లీక్ అవ్వడం చిత్రబృందానికి పెద్ద షాకింగ్‌గా మారింది

By:  Tupaki Desk   |   24 Jan 2025 5:24 AM GMT
గేమ్ ఛేంజర్.. మళ్ళీ అదే దెబ్బ!
X

ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ సినిమా పైరసీ ఇండస్ట్రీకి పెద్ద సమస్యగా మిగులుతోంది. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన “గేమ్ ఛేంజర్” గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. కానీ ఈ పాన్ ఇండియా మూవీ విడుదలైన రోజు నుంచే పైరసీ దెబ్బ తగిలింది. ఆన్లైన్‌లో ఫుల్ క్లారిటీ ప్రింట్ లీక్ అవ్వడం చిత్రబృందానికి పెద్ద షాకింగ్‌గా మారింది.

లోకల్ టీవీ కేబుల్ లో కూడా ప్రసారం చేశారు అంటే విషయం ఎంత సీరియస్ గా ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ సమస్య మారువకముందే, ఇప్పుడు మరోసారి “గేమ్ ఛేంజర్” పై మరోసారి పైరసీ దెబ్బ పడింది. ఈసారి తమిళ్ వెర్షన్ 4K క్లారిటీతో ఒరిజినల్ ఆడియోతో కూడిన ప్రింట్ లీక్ అయిందని సమాచారం. ఓటీటీకి రాకముందే, ఈ స్థాయి లీక్ రావడంతో, చిత్రబృందం ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తోంది.

ఇదే కాదు, ఇటీవల కాలంలో ఇతర చిత్రాలు కూడా తమిళ్ వెర్షన్ నుంచే లీక్ అవుతున్నట్లు తరచూ వార్తలు వస్తున్నాయి. ఈ సమస్యను ఇండస్ట్రీ ఎలా ఎదుర్కోవాలో అనే చర్చ మళ్లీ మొదలైంది. ఈ లీక్‌లు కేవలం నిర్మాతలకే కాక, సినిమా కమర్షియల్ సక్సెస్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. డిజిటల్, ఒటీటీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రాబడిని పెంచుకోవాలని చూస్తున్న నిర్మాతలకు ఈ తరహా సమస్యలు భారీ నష్టాలను తెస్తున్నాయి.

ముఖ్యంగా గేమ్ ఛేంజర్ లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రానికి ఈ సమస్య మరింత క్లిష్టంగా మారుతోంది. “గేమ్ ఛేంజర్” ఇప్పటికే ఊహించని నష్టాలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో ఎంతో కొంత థియేట్రికల్ రన్ లో నష్టాలను తగ్గించే ప్రయత్నంలో ఉండగా.. ఈ లీక్‌లు ఆ క్రేజ్‌ను మరింత దెబ్బ తీస్తున్నాయి. ఇది చిత్ర యూనిట్‌కు పెద్ద సవాలుగా మారింది.

టాలీవుడ్ సహా కోలీవుడ్, ఇతర పరిశ్రమలు కలిసి ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాయో చూడాలి. ఇక ఈ లీక్ వ్యవహారంతో “గేమ్ ఛేంజర్” యూనిట్ మరింత జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమస్యను సమర్థంగా పరిష్కరించకపోతే, భవిష్యత్తులో పెద్ద చిత్రాలకు మరింత ప్రమాదం వాటిల్లే అవకాశం ఉండవచ్చు. ఇక గేమ్ ఛేంజర్ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించగా నిర్మాత దిల్ రాజు 350కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక ఓటీటీ లో సినిమా అనుకున్న ఒప్పందం కంటే ముందుగానే వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్.