గేమ్ ఛేంజర్ యూఎస్ టార్గెట్.. ఆ రేంజ్ లో సాధ్యమేనా?
లేటెస్ట్ టాప్ హీరోలందరికీ నార్త్ అమెరికాలో మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 12 Dec 2024 11:30 AM GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ హీరోలు ప్రతీ సినిమాతో కూడా మార్కెట్ ను అంతకంతకూ పెంచుకుంటూ వెళుతున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఊహించని స్థాయిలో మార్కెట్ వేల్యూ పెరుగుతోంది. లేటెస్ట్ టాప్ హీరోలందరికీ నార్త్ అమెరికాలో మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. మొన్నటివరకు 3 మిలియన్ అందుకున్న వారు కూడా ఇప్పుడు $10 మిలియన్ గ్రాస్ కలెక్షన్స్ సాధించడం ఒక ప్రతిష్టాత్మకమైన అంశంగా మారింది.
ఇందులో ప్రభాస్ పలు చిత్రాలతో ఈ ఘనతను పలుమార్లు సాధించగా, రామ్ చరణ్, ఎన్టీఆర్ మాత్రం సోలోగా ఈ రికార్డ్ ను తాకలేకపోయారు. అయితే, వీరిద్దరూ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ మాత్రం ఈ కలెక్షన్ టార్గెట్‌ను దాటింది. ఎన్టీఆర్ ఇటీవల విడుదలైన దేవర సినిమాతో $10 మిలియన్ టార్గెట్‌ను చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ, ఆ చిత్రం కలెక్షన్స్ $6 మిలియన్ వద్ద ఆగిపోయింది.
ఇక లేటెస్ట్ గా అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రంతో 10 మిలియన్ ను అందుకోవడమే కాకుండా, $15 మిలియన్ మైలురాయికి చేరువగా ఉన్నాడు. పుష్ప 2 నార్త్ అమెరికాలో సృష్టించిన సంచలన కలెక్షన్స్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఇప్పుడు, రామ్ చరణ్ ముందు కూడా ఇదే టార్గెట్ ఉంది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ ను యూఎస్ లో కూడా గ్రాండ్ ప్రమోషన్స్ తో విడుదల చేయాలని అనుకుంటున్నారు. కానీ సినిమాపై అనుకున్నంత బజ్ అయితే లేదు.
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతుండటంతో ఆయన ఇండియన్ 2 ఎఫెక్ట్ గట్టిగానే ఉంది. అందుకే గేమ్ ఛేంజర్ కు పుష్ప 2 స్థాయిలో ప్రస్తుతానికి హైప్ లేదు. అయినప్పటికీ ఫ్యాన్స్ లో ఒక నమ్మకం ఉంది. ఆర్ఆర్ఆర్ తో అమెరికాలో రామ్ చరణ్ క్రేజ్ అమితంగా పెరిగింది. ఇదే జోష్‌ను ఆయన గేమ్ ఛేంజర్ తో కొనసాగిస్తాడాని అనుకుంటున్నారు. ఈ టార్గెట్‌ను చేరుకోవడంలో మరింత ఊతం ఇవ్వాలనే ఉద్దేశంతో, డిసెంబర్ 21న డల్లాస్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించడానికి రామ్ చరణ్ సిద్ధమవుతున్నారు.
అమెరికా ప్రేక్షకులతో మరింత దగ్గరగా మమేకం కావడానికి ఆయన ఈ టూర్‌కి ప్లాన్ చేశారు. ఈ ప్రమోషన్లు గేమ్ ఛేంజర్కు అనుకూలంగా మారితే, రామ్ చరణ్ ఈ సాలిడ్ టార్గెట్‌ను చేరే అవకాశం ఉంది. అయితే, గేమ్ ఛేంజర్ కు ఇది ఒక పరీక్ష. రామ్ చరణ్ ఒక సింగిల్ హీరోగా అమెరికాలో ఈ స్థాయి కలెక్షన్స్ సాధిస్తే, ఇది తెలుగు సినిమా చరిత్రలో మరో కీలక ఘట్టం అవుతుంది. ఆయన క్రేజ్, ప్రమోషన్ల ప్రభావం ఎంత వరకు ఉంటుందనేది సినిమాకు విడుదలైన తర్వాత స్పష్టమవుతుంది.