Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్.. ఏదో ఒకటి చేయండి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

By:  Tupaki Desk   |   29 Aug 2024 3:51 AM GMT
గేమ్ ఛేంజర్.. ఏదో ఒకటి చేయండి
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి మరో బ్లాక్ బస్టర్ హిట్ ని పాన్ ఇండియా లెవల్ లో రామ్ చరణ్ అందుకుంటే చూడాలని కోరుకుంటున్నారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న గేమ్ చేంజర్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది.

అయితే రకరకాల కారణాలతో మూవీ షూటింగ్ ను ఇంకా కొనసాగిస్తున్నారు. మెగా హీరో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ లో ఒక రకమైన వైబ్రేషన్ ఉంటుంది. అలాంటిది గేమ్ చేంజర్ విషయంలో మాత్రం మెగా ఫ్యాన్స్ లో అంత ఉత్సాహం లేదు. దీని తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ చేయబోయే RC16పైన ఉన్నంత బజ్ కూడా గేమ్ చేంజర్ చిత్రం పైన లేకపోవడం గమనార్హం. శంకర్ నుంచి గత నెల వచ్చిన ఇండియన్ 2 డిజాస్టర్ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మీద బాగా పడిందనే మాట వినిపిస్తోంది.

అందుకే ఈ సినిమాపై సోషల్ మీడియాలో కూడా పెద్దగా చర్చ జరగడం లేదు. అలాగే చిత్ర యూనిట్ కూడా మొదటి నుంచి గేమ్ చేంజర్ అప్డేట్స్ విషయంలో చాలా స్లోగా ఉన్నారు. సినిమాని జనాల్లోకి బలంగా తీసుకొని వెళ్లి హైప్ క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎక్కడా కనిపించడం లేదు. ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. గతంలో గేమ్ చేంజర్ నుంచి జరగండి జరగండి అనే సాంగ్ ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ అయిన ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు.

ఆగష్టు నెల ఆఖరులో సెకండ్ సింగిల్ అప్డేట్ ఉంటుందని భావించన శంకర్ టీమ్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7న గేమ్ చేంజర్ నుంచి ఏదో ఒక కంటెంట్ ని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందంట. ఫెస్టివల్ సందర్భంగా అంటే పండగ హడావిడి ఉంటుంది. ఆ టైంలో కాస్తా వైరల్ అయ్యే విధంగా ఏదైనా కంటెంట్ రిలీజ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం మెగా ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.

గేమ్ చేంజర్ మీద ఇప్పటి వరకు మినిమమ్ బజ్ కూడా లేదు. ఈ మధ్య శంకర్ మళ్ళీ రీషూట్స్ పెడుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇలాంటి టైంలో సినిమాపై ఏ మాత్రం హైప్ క్రియేట్ చేయకపోయిన రిలీజ్ టైంకి ఎవరు కూడా పట్టించుకోవడం మానేసే ప్రమాదం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చిరంజీవి, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన ఆచార్య మీద కూడా రిలీజ్ కి ముందు మంచి బుజ్ క్రియేట్ అయ్యింది. కానీ ఎందుకనో గేమ్ చేంజర్ మాత్రం ఎలాంటి హైప్ ని అందుకోలేకపోతోంది.