Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్.. వారి బాదేంటి?

ఈ నెలలో బిగ్ అప్డేట్ ఇవ్వనున్నామని తెలిపారు. అదే టీజర్ అప్డేట్ ఏమో. కాబట్టి కొన్ని పరిస్థితుల వల్ల మేకర్స్ అప్డేట్స్ ఇవ్వకపోయి ఉండవచ్చు.

By:  Tupaki Desk   |   5 Sep 2024 6:07 AM GMT
గేమ్ ఛేంజర్.. వారి బాదేంటి?
X

సాధారణంగా అభిమానులు.. తమ ఫేవరెట్ హీరోల చిత్రాలకు సంబంధించిన స్పెషల్ అప్డేట్స్ అడగడం కామన్. ఫెస్టివల్స్ అండ్ అకేషన్స్ టైమ్ లో కచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అలా జరగనప్పుడు సోషల్ మీడియాలో కొందరు ఆవేదన వ్యక్తం చేస్తే.. మరికొందరు మండిపడుతుంటారు. కొన్ని సినిమాల మేకర్స్.. వాటికి స్పందిస్తుంటారు. మరికొన్ని చిత్రాల టీమ్స్.. మాత్రం సైలెంట్ గా తమ వర్క్ పూర్తి చేసి అప్డేట్స్ ఇస్తుంటాయి.

ఇక కొన్ని గంటలుగా టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఫ్యాన్స్.. నెట్టింట అభ్యంతరకరమైన ట్యాగ్ తో ట్రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. కొందరు డైరెక్టర్ శంకర్ పై అనుచితమైన ట్వీట్లు పెడుతున్నారు. చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీ టీజర్ ను రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మూడేళ్లుగా షూటింగ్ జరుగుతుందని, ఇంకెప్పుడు మూవీ రిలీజ్ చేస్తారని అడుగుతున్నారు. ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని కోరుతున్నారు.

అయితే ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటున్న గేమ్ ఛేంజర్ మూవీ క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ అవ్వనుందని అంటున్నారు. వినాయక చవితి స్పెషల్ గా పోస్టర్ షేర్ చేసి విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారని టాక్ నడుస్తోంది. కానీ ఇప్పటి వరకు సినిమా నుంచి జరగండి జరగండి సాంగ్ తప్ప మరో అప్డేట్ రాలేదు. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు.

అప్డేట్స్ రాకపోవడంతో తమ కోపాన్ని తట్టుకోలేక అభ్యంతరకరంగా ఉన్న ట్యాగ్ తో ట్రోల్స్ చేస్తున్నట్లు ఉన్నారు! అయితే ఫ్యాన్స్ నిరాశ నిజమైనప్పటికీ.. అలాంటి ట్యాగ్ ను యూజ్ చేయడం కరెక్ట్ కాదని సినీ ప్రియులు చెబుతున్నారు. వాటి వల్ల సినిమాపై నెగిటివిటీ ఏర్పడుతుందని అంటన్నారు. మంచి కన్నా చెడే ఎక్కువగా జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. బ్యాడ్ ట్యాగ్ వల్ల ఎలాంటి లాభం లేదని చెబుతున్నారు.

రీసెంట్ గా తమన్.. మూవీ పేరు చెప్పకపోయినా గేమ్ ఛేంజర్ ఉద్దేశించి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నెలలో బిగ్ అప్డేట్ ఇవ్వనున్నామని తెలిపారు. అదే టీజర్ అప్డేట్ ఏమో. కాబట్టి కొన్ని పరిస్థితుల వల్ల మేకర్స్ అప్డేట్స్ ఇవ్వకపోయి ఉండవచ్చు. మూవీ టీమ్.. ఫుల్ బిజీగా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే ఫ్యాన్స్.. కాస్త ఓపికగా వెయిట్ చేయడం బెటర్ అని అంతా సూచిస్తున్నారు. బ్యాడ్ మీనింగ్ ట్యాగ్స్ యూజ్ చేయొద్దని కోరుతున్నారు.