గేమ్ ఛేంజర్.. యూఎస్ లో పరిస్థితి ఎలా ఉందంటే..
ఇప్పుడు గేమ్ ఛేంజర్.. 281K డాలర్సే రాబట్టింది. కేవలం 9.6 టికెట్లు అమ్మడైనట్లు తెలుస్తోంది. దీంతో గేమ్ ఛేంజర్.. యూఎస్ ప్రీ బుకింగ్స్ లో జోరు చూపించాల్సి ఉంది.
By: Tupaki Desk | 28 Dec 2024 7:53 AM GMTటాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ మూవీతో మరికొద్ది రోజుల్లో సందడి చేయనున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఆ సినిమాతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జనవరి 10వ తేదీన థియేటర్లలో సందడి చేయనున్నారు మన మెగా పవర్ స్టార్.
ప్రస్తుతం ప్రమోషన్స్ తో మేకర్స్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా అమెరికాలో గేమ్ ఛేంజర్ ఈవెంట్ ను నిర్వహించిన మేకర్స్.. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమాలతో సందడి చేయనున్నారు. అయితే యూఎస్ లోని డల్లాస్ లో ఈవెంట్ జరిగిన కొద్ది రోజుల ముందే.. అక్కడ గేమ్ ఛేంజర్ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి.
కానీ అనుకున్న స్థాయిలో ప్రీ బుకింగ్స్ జరగడం లేదని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. మూవీ రిలీజ్ అండ్ ప్రీమియర్స్ కు టైమ్ ఇంకా రెండు వారాలే ఉన్నా.. పెద్దగా సందడి కనిపించడం లేదు! ఇప్పటి వరకు యూఎస్ ప్రీ బుకింగ్స్ ద్వారా గేమ్ ఛేంజర్ మూవీ 281K డాలర్స్ ను మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
నిజానికి అమెరికాలో భారీ స్థాయిలో గేమ్ ఛేంజర్ విడుదలవుతున్నా.. ఇంకా పది వేల మార్క్ ను కూడా దాటక పోవడం గమనార్హం. అదే సమయంలో కల్కి 2898 ఏడీ, దేవర, పుష్ప-2 చిత్రాలు.. రిలీజ్ కు 15 రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో అదరగొట్టేశాయి. 800 వేల డాలర్లకు పైగా వసూలు చేశాయి.
2024లో రిలీజ్ కు 15 రోజుల ముందు ప్రీ బుకింగ్స్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా 1.04 మిలియన్ డాలర్లతో జూనియర్ ఎన్టీఆర్ దేవర నిలిచింది. రెండో స్థానంలో పుష్ప-2 రూ.1 మిలియన్ డాలర్స్ తో ఉండగా.. కల్కి మూవీ మూడో స్థానంలో ఉంది. 28.4 వేల టిక్కెట్లను విక్రయించి 873 వేల USD వసూలు చేసింది.
ఇప్పుడు గేమ్ ఛేంజర్.. 281K డాలర్సే రాబట్టింది. కేవలం 9.6 టికెట్లు అమ్మడైనట్లు తెలుస్తోంది. దీంతో గేమ్ ఛేంజర్.. యూఎస్ ప్రీ బుకింగ్స్ లో జోరు చూపించాల్సి ఉంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాలంటే ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా కీలకమే. ఇప్పటికే మేకర్స్ అక్కడ ఈవెంట్ నిర్వహించినా.. ఇంకా సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేయాల్సిందేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి మేకర్స్ ఏం చేస్తారో.. అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ఊపందుకుంటాయో లేదో వేచి చూడాలి.