Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్ యూఎస్ బాక్సాఫీస్‌.. ఇది ఊహించని దెబ్బ!

మొదటి వారమే దారుణంగా తగ్గిపోవడం యూఎస్ ట్రేడ్‌ వర్గాలను తీవ్రంగా నిరాశపరిచింది. యూఎస్‌లో గేమ్ ఛేంజర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ $4.5 మిలియన్లు.

By:  Tupaki Desk   |   15 Jan 2025 8:29 AM GMT
గేమ్ ఛేంజర్ యూఎస్ బాక్సాఫీస్‌.. ఇది ఊహించని దెబ్బ!
X

గేమ్ ఛేంజర్ సినిమా విడుదలకు ముందు కాస్త పాజిటివ్ హైప్ క్తియేట్ చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు కాస్త నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ ట్రైలర్ తో ఒక్కసారిగా మేకర్స్ అంచనాలను క్రియేట్ చేసేలా ప్రమోషన్స్ చేశారు. ముఖ్యంగా యూఎస్ మార్కెట్‌లో బజ్ కోసం స్పెషల్ గా ఈవెంట్ చేయడం విషయం. చిత్ర యూనిట్ మొత్తం వెళ్లి మరీ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. కానీ యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో క్లిక్కవ్వడం లేదు.

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మొదటి పాన్ ఇండియా చిత్రం తప్పకుండా వండర్స్ క్రియేట్ చేస్తుందని మేకర్స్ గట్టిగా ప్రమోషన్స్ చేశారు. అయితే, విడుదల అనంతరం ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చింది. సినిమా వసూళ్లు మొదటి వారమే దారుణంగా తగ్గిపోవడం యూఎస్ ట్రేడ్‌ వర్గాలను తీవ్రంగా నిరాశపరిచింది. యూఎస్‌లో గేమ్ ఛేంజర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ $4.5 మిలియన్లు.

అయితే ఇప్పటి వరకు సినిమా కలెక్ట్ చేసిన టోటల్ కేవలం $1.8 మిలియన్ల దగ్గరే ఆగిపోయింది. మిగిలిన రికవరీ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. సినిమాకు సంబంధించిన టాక్, రివ్యూలు నెగటివ్‌గా ఉండటంతో, థియేటర్లలో ఆడియన్స్ ఆదరణ చాలా తక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో థియేటర్ పాసెస్ సదుపాయాన్ని అందించినప్పటికీ కలెక్షన్లపై పెద్దగా ప్రభావం చూపలేదు.

రీసెంట్ గా అందిన రిపోర్ట్ ప్రకారం, సినిమా కేవలం $57,756 వసూళ్లు సాధించింది. ఒక రోజుకు $100K మార్క్ చేరడం కూడా అనుమానంగా మారింది. ఈ ట్రెండ్ చూస్తుంటే, రాబోయే రోజుల్లో పరిస్థితి మెరుగుపడే సూచనలు లేవు. ఇప్పటివరకు యూఎస్ మార్కెట్‌లో ఇంతటి ఘోర పరాజయం చవిచూసిన పాన్ ఇండియా తెలుగు చిత్రం ఇదే కావడం చర్చనీయాంశంగా మారింది.

సినిమా ఈ వారం చివరి నాటికి థియేటర్లలో ప్రదర్శన ముగించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తం మీద, గేమ్ ఛేంజర్ యూఎస్ మార్కెట్‌లో సుమారు $2.2–$2.3 మిలియన్ల గ్రాస్‌తో ముగిసే అవకాశం ఉంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోవడంలో భారీ వైఫల్యం ఈ చిత్రానికి ఓ చేదు అనుభవంగా మిగిలిపోనుంది. దాదాపు 2 మిలియన్స్ వరకు నష్టపోయే అవకాశం ఉంది.

రామ్ చరణ్ నటన, శంకర్ టేకింగ్ వంటి అంశాల మీద మంచి అంచనాలు ఉన్నా, కథ, స్క్రీన్‌ప్లే, నెరేషన్లో వచ్చిన లోపాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. దీనివల్ల సినిమా పెట్టుబడిదారులకు భారీగా నష్టాలు సంభవిస్తున్నాయి. యూఎస్ బయ్యర్లకు ఇది ఊహించని దెబ్బె. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్దగా కలెక్షన్స్ ఏమి రాలేవు. చూస్తుంటే రామ్ చరణ్ కెరీర్ లోనే కాకుండా దిల్ రాజు కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ లాస్ గా నిలిచే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.