చరణ్ వర్సెస్ అజిత్.. అంత ఈజీ కాదు!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం.. జనవరి 10వ తేదీన గ్రాండ్ గా వరల్డ్ గా విడుదల అవ్వనుంది.
By: Tupaki Desk | 26 Dec 2024 6:41 AM GMTటాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ మూవీతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది పొంగల్ బరిలో దిగనున్న ఫస్ట్ సినిమా గేమ్ ఛేంజరే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం.. జనవరి 10వ తేదీన గ్రాండ్ గా వరల్డ్ గా విడుదల అవ్వనుంది.
అయితే గేమ్ ఛేంజర్ ఫస్ట్ రిలీజ్ అవ్వనుండడంతో మంచి అడ్వాంటేజ్ ఉందని చెప్పొచ్చు. మౌత్ టాక్ పాజిటివ్ గా ఉంటే చాలు.. సినిమా దూసుకుపోతోంది. భారీ వసూళ్లను సాధిస్తుంది. అదే సమయంలో ఆడియన్స్ లో మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ కూడా రోజురోజుకు సినిమాపై అంచనాలు పెంచుకుంటూ పోతున్నారు.
ఇక గేమ్ ఛేంజర్ తోపాటు సంక్రాంతికి బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, అజిత్ విడాముయూర్చి కూడా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. బాలయ్య, వెంకటేష్ చిత్రాలతో గేమ్ ఛేంజర్ కు ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ.. అజిత్ మూవీతో మాత్రం కచ్చితంగా సమస్యలు వచ్చేలా పరిస్థితి క్లియర్ గా కనిపిస్తోంది!
ఎందుకంటే విడాముయూర్చి కూడా జనవరి 10వ తేదీన రిలీజ్ అవ్వనుందని తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు టాక్. దీంతో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానున్న గేమ్ ఛేంజర్ కు తమిళనాట థియేటర్లు అనుకున్న స్థాయిలో దొరకవనే చెప్పాలి. అజిత్ మూవీకే అక్కడి డిస్ట్రిబ్యూటర్లు జై కొడతారు.
దానికి తోడు తమిళనాడులో పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఎక్కువ థియేటర్స్ లో విడాముయార్చి రిలీజ్ అవ్వనుంది. ఒకవేళ గేమ్ ఛేంజర్ కు సాలిడ్ థియేటర్స్ దక్కినా.. అక్కడి ఆడియన్స్.. అజిత్ మూవీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారని చెప్పడంలో ఎవరికీ ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
దీంతో అన్ని విషయాల్లో గేమ్ ఛేంజర్ తమిళ వెర్షన్ కు పెద్ద సవాల్ ఎదురవ్వనుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే అజిత్ మూవీపై ఆడియన్స్ లో హైప్ కాస్త తక్కువ ఉన్నా.. మేకర్స్ ఓ రేంజ్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసేందుకు ప్లాన్స్ గీస్తున్నారు. పక్కా ప్లాన్ తో సినిమాను ప్రమోట్ చేయాలని చూస్తున్నారట. మరి గేమ్ ఛేంజర్.. తమిళనాడులో ఎలా సత్తా చాటుతుందో వేచి చూడాలి.