Begin typing your search above and press return to search.

'గేమ్ ఛేంజర్' - దిల్ రాజు ప్లాన్ ఎలా ఉందంటే..

'గేమ్ ఛేంజర్' విడుదల తేదీని నిర్ణయించడం కోసం దిల్ రాజు చాలా సమయమే కేటాయించారు. మొదట డిసెంబర్ 20న సినిమా విడుదల చేసి సేఫ్ గా సోలో రిలీజ్ చేస్తే బెటర్ అని అనుకున్నారు.

By:  Tupaki Desk   |   22 Oct 2024 10:27 AM GMT
గేమ్ ఛేంజర్ - దిల్ రాజు ప్లాన్ ఎలా ఉందంటే..
X

టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మక చిత్రాల నిర్మాతగా పేరొందిన దిల్ రాజు తన బ్రాండ్ ను 'గేమ్ ఛేంజర్' చిత్రంతో మరింత ముందుకు తీసుకువెళ్లాలని చూస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం దిల్ రాజు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. ఈ సినిమా మీద ఆయన ఎంత నమ్మకంతో ఉన్నారో ఈ ప్రాజెక్ట్‌ విషయంలో తీసుకుంటున్న ప్రణాళికలే చెప్పేస్తున్నాయి.

'గేమ్ ఛేంజర్' విడుదల తేదీని నిర్ణయించడం కోసం దిల్ రాజు చాలా సమయమే కేటాయించారు. మొదట డిసెంబర్ 20న సినిమా విడుదల చేసి సేఫ్ గా సోలో రిలీజ్ చేస్తే బెటర్ అని అనుకున్నారు. కానీ, సంక్రాంతి సీజన్‌లో వచ్చే కలెక్షన్లపై ఆయనకు ఉన్న నమ్మకం వల్ల సంక్రాంతికే సినిమాను విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఈ భారీ ప్రాజెక్ట్ సంక్రాంతి పోరులో భారీగా థియేటర్స్ దక్కించుకుంటుందని చెప్పవచ్చు.

సంక్రాంతికి తమ సినిమా హిట్ కావడం గ్యారెంటీ అని దిల్ రాజు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ సీజన్ బ్లాక్ బస్టర్ హిట్‌లకు ఎంత బలమో దానికి తగ్గట్టుగా పోటీ కూడా ఉంటే సినిమా మరింత జోష్‌లో ఉంటుందని ఆయన భావిస్తున్నారు. అందుకే మిగతా సినిమాల రాకపోకలు, వాటి బలం-బలహీనతలను కూడా గమనిస్తూ తగిన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు.

మరోవైపు, వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను కూడా సొంత బ్యానర్‌లోనే నిర్మిస్తున్నారు. దీన్ని కూడా సంక్రాంతి విడుదలకు సిద్ధం చేస్తున్నారు. 'గేమ్ ఛేంజర్' తో పోటీ పడకుండా సర్దుబాటు చేయడానికి ఈ సినిమాను ముందుగా వాయిదా వేసే ఆలోచనతో ఉన్నారు. కానీ, ఇప్పుడు ఆయన వ్యూహాల్లో మార్పు కనిపిస్తోంది.

'గేమ్ ఛేంజర్' జనవరి 10న విడుదల చేసిన తర్వాత జనవరి 14న వెంకీ సినిమా విడుదల చేయాలనే ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం అనిల్ రావిపూడికి షూటింగ్ త్వరగా పూర్తి చేయాలని డెడ్‌లైన్ ఇచ్చారు. ఈ సంక్రాంతి పోరులో ముందుగా 'గేమ్ ఛేంజర్', బాలకృష్ణ సినిమా, 'గుడ్ బాడ్ అగ్లీ' చిత్రాలు ఉంటే, నాలుగో సినిమాగా వెంకీ మూవీ రావాలని చూస్తున్నారు. అయితే, సంక్రాంతి సమయంలో ఈ సంఖ్య పెరిగితే వెంకటేష్ సినిమా వాయిదా వేయడం తప్పవదని చెబుతున్నారు. చివరికి, ఈ సంక్రాంతి బరిలో దిల్ రాజు ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.