Begin typing your search above and press return to search.

బిగ్ క్లాష్.. చరణ్ కు దగ్గరగానే బాలయ్య

ఈ మధ్య కాలంలో నందమూరి బాలయ్య వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నారు.

By:  Tupaki Desk   |   21 Oct 2024 11:30 AM GMT
బిగ్ క్లాష్.. చరణ్ కు దగ్గరగానే బాలయ్య
X

ఈ మధ్య కాలంలో నందమూరి బాలయ్య వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నారు. ఇప్పుడు బాబీ డైరెక్షన్‌లో ఓ సినిమాను చేస్తున్నారు. NBK109 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం హై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. దీంతో ఈ చిత్రం కోసం నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాళ్ల అంచనాలను ఏమాత్రం కోల్పోకుండా ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

టాలీవుడ్ సీనియర్ స్టార్ నందమూరి బాలకృష్ణ - బాబీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాను ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారు అన్న దానిపై చాలా రోజుల పాటు చర్చలు జరిగాయి. ఆ సమయంలోనే దీన్ని క్రిస్టమస్ కానుకగా డిసెంబర్‌లో విడుదల చేస్తారని అన్నారు. కానీ, ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌పై మాత్రం క్లారిటీ రాలేదు. దీంతో ఎవరికి తోచిన విధంగా వాళ్లు మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై నందమూరి బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నారని తాజాగా లీక్ అయింది. ఫిలిం నగర్ ఏరియా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను జనవరి 12వ తేదీన విడుదల చేస్తున్నారట.

స్వతహాగా ముహూర్తాలు, రిలీజ్ డేట్లు పరంగా సెంటిమెంట్లను ఫాలో అయ్యే నందమూరి బాలయ్య.. తన కొత్త సినిమాను జనవరి 12వ తేదీనే విడుదల చేయాలని డిసైడ్ అయిపోయారట. ఇప్పటికే ఈ విషయంపై దర్శక, నిర్మాతలతోనూ ఆయన చర్చలు జరిపారని తెలుస్తోంది. ఇక, ఈ తేదీని దీపావళి కానుకగా విడుదల చేయబోతున్న టైటిల్ పోస్టర్‌లో రివీల్ చేయబోతున్నారని తెలిసింది.

అయితే సంక్రాంతి క్లాష్ లో జనవరి 10న గేమ్ ఛేంజర్ రానున్న విషయం తెలిసిందే. కేవలం రెండు రోజుల గ్యాప్ లోనే ఈ క్లాష్ ఉండడంతో బాక్సాఫీస్ వద్ద వాతావరణం వేడెక్కే అవకాశం ఉంది. అలాగే సందీప్ కిషన్ మజాకా కూడా అదే టైమ్ లో రానుంది. ఇక అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా రానుంది. మరి ఈ పోటీలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

NBK109 సినిమాకు ‘సర్కార్ సీతారామ్’ అనే టైటిల్‌ను ఇప్పటికే ఫిక్స్ చేసుకున్నట్లు తెలిసింది. ఇందులో బాబీ డియోల్, ఊర్వశీ రౌటేలా, చాందినీ చౌదరి, దుల్కర్ సల్మాన్ వంటి వాళ్లు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.