Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్.. ఫ్యాన్స్ డిమాండ్ ఇదే..

మూడేళ్లుగా మూవీ షూటింగ్ జరుగుతుండగా.. ఇప్పుడు చివరి దశకు చేరుకుంది.

By:  Tupaki Desk   |   29 Sep 2024 10:17 AM GMT
గేమ్ ఛేంజర్.. ఫ్యాన్స్ డిమాండ్ ఇదే..
X

బ్లాక్ బస్టర్ హిట్ ఆర్ఆర్ఆర్ తర్వాత స్టార్ హీరో రామ్ చరణ్.. సోలోగా నటిస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ ను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మూడేళ్లుగా మూవీ షూటింగ్ జరుగుతుండగా.. ఇప్పుడు చివరి దశకు చేరుకుంది.

త్వరలో చిత్రీకరణకు మేకర్స్ గుమ్మడికాయ కొట్టనున్నారని తెలుస్తోంది. చరణ్ తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానున్న గేమ్ ఛేంజర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే జరగండి సాంగ్ ను రిలీజ్ చేసిన మేకర్స్.. మరికొద్ది గంటల్లో సెకండ్ సాంగ్ ను విడుదల చేయనున్నారు.

'రా మచ్చా మచ్చా' అంటూ సాగుతున్న రెండో పాట ప్రోమోను మేకర్స్ నిన్న రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఫుల్ మాస్ బీట్ తో ఉన్న సాంగ్ కు చరణ్.. తన గ్రేస్ ఫుల్ స్టెప్పులతో ప్రోమోలో అలరించారు. బ్యాక్ గ్రౌండ్ లో వేలాది మంది డ్యాన్సర్లు కనిపించారు. అనేక రాష్ట్రాలకు చెందిన 1000 మంది జానపద కళాకారులు పాటలో భాగమైనట్లు డైరెక్టర్ శంకర్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. దీంతో సాంగ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అదే సమయంలో ఇప్పుడు సినీ ప్రియులుతో పాటు చరణ్ ఫ్యాన్స్.. మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం.. ఓ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు.. గేమ్ ఛేంజర్ తో క్రిస్మస్ కు కలుద్దామని చెప్పారు. రీసెంట్ గా తమన్.. డిసెంబర్ 20వ తేదీన మూవీ విడుదల కానున్నట్లు ఇన్ డైరెక్ట్ గా సోషల్ మీడియాలో ప్రకటించారు. కానీ మేకర్స్ నుంచి ఇప్పటి వరకు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు.

దీంతో రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించాలని ఇప్పుడు పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. పాన్ ఇండియా మూవీ కనుక.. వివిధ భాషల్లో విడుదలయ్యే బడా చిత్రాల రిలీజ్ లను దృష్టిలో పెట్టుకుని విడుదల తేదీ వెంటనే అనౌన్స్ చేయాలని కోరుతున్నారు. అలా చేస్తే మూవీకి బెనిఫిట్ ఉంటుందని అంటున్నారు. మరి గేమ్ ఛేంజర్ మేకర్స్.. అఫీషియల్ గా ఎప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారో వేచి చూడాలి.