Begin typing your search above and press return to search.

సంక్రాంతి ఫైట్.. దిల్ రాజు ప్లాన్ ఎలా ఉందంటే..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘గేమ్ చేంజర్’ రిలీజ్ సంక్రాంతికి కన్ఫర్మ్ అయ్యింది.

By:  Tupaki Desk   |   19 Oct 2024 5:04 AM GMT
సంక్రాంతి ఫైట్.. దిల్ రాజు ప్లాన్ ఎలా ఉందంటే..
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘గేమ్ చేంజర్’ రిలీజ్ సంక్రాంతికి కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమాపై మెగా అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. అలాగే నిర్మాత దిల్ రాజుకి ఇది ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో చాలా నమ్మకంతో ఉన్నారు. డైరెక్టర్ శంకర్ కి కూడా కెరియర్ పరంగా ఈ మూవీ సక్సెస్ చాలా ముఖ్యం. ఇక రామ్ చరణ్ మార్కెట్ స్టామినా ఏంటనేది గేమ్ చేంజర్ తోనే తెలిసే ఛాన్స్ ఉంటుంది.

ఇలా అందరికి ‘గేమ్ చేంజర్’ మూవీ విజయం చాలా అవసరం అని చెప్పాలి. అయితే ఈ సినిమాపై చెప్పుకోదగ్గ బజ్ ఇప్పటి వరకు లేదు. రెండు సాంగ్స్ రిలీజ్ అయిన ప్రేక్షకులని పూర్తిగా మెప్పించలేదు. దీపావళికి ‘గేమ్ చేంజర్’ టీజర్ ని రీరిలీజ్ చేయబోతున్నారు. ఈ టీజర్ తో మూవీకి ఊపొస్తుందని భావిస్తున్నారు. శంకర్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై చాలా శ్రద్ధ పెట్టారు. ఇదిలా ఉంటే దిల్ రాజు ఈ సినిమాని సంక్రాంతికి పెర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలలో 50 శాతం థియేటర్స్ లలో ‘గేమ్ చేంజర్’ మూవీని రిలీజ్ చేయనున్నారంట. అలాగే భారీ ఎత్తున బెన్ ఫిట్ షోలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మిడ్ నైట్ షోలతో పాటు ఎర్లీ మార్నింగ్ షోలు కూడా వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లో వేయనున్నారని టాక్. టికెట్ ధరలు కూడా పెంచుకోవడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాగూ పర్మిషన్ ఇస్తాయి. సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా ఆడియన్స్ ఫస్ట్ ఛాయస్ కూడా ‘గేమ్ చేంజర్’ ఉండే ఛాన్స్ ఉంది. అందుకే మెజారిటీ థియేటర్స్ లలో ఈ చిత్రాన్ని వేయనున్నారంట.

మిగిలిన 50 శాతం థియేటర్స్ లలో ఇతర సినిమాలు ప్రదర్శిస్తారని తెలుస్తోంది. జనవరి 10న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. తరువాత శని, ఆదివారాలు వస్తున్నాయి. జనవరి 13, 14, 15 తేదీలలో భోగీ, సంక్రాంతి, కనుమ ఉన్నాయి. ఈ మూడు రోజులు ప్రేక్షకులు సినిమాలు చూడటానికి విపరీతంగా ఆసక్తి చూపిస్తారు. మొత్తం సంక్రాంతి ఫెస్టివల్, వీకెండ్ కలిపి 6 రోజులు ‘గేమ్ చేంజర్’ కి అదిరిపోయే కలెక్షన్స్ రావడం గ్యారెంటీ అని మేకర్స్ భావిస్తున్నారు.

కరెక్ట్ గా పబ్లిసిటీ చేసి, సినిమాని వీలైనంత స్ట్రాంగ్ గా జనాల్లోకి తీసుకొని వెళ్తే భారీ కలెక్షన్స్ కొల్లగొట్టడం గ్యారెంటీ అని అంచనా వేస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే, మూవీకి పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా కలెక్షన్స్ ఊచకోత ఖాయం అని ట్రేడ్ పండితులు కూడా భావిస్తున్నారు.