Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్.. ఆ ఎఫెక్ట్ తప్పేలా లేదు?

సరిగ్గా అదే సమయంలో బాలీవుడ్లో అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్ కలిసి నటిస్తున్న 'బడే మియా చోటే మియా' మూవీ దేవరతో పోటీకి దిగుతోంది.

By:  Tupaki Desk   |   19 Jan 2024 1:30 AM GMT
గేమ్ ఛేంజర్.. ఆ ఎఫెక్ట్ తప్పేలా లేదు?
X

గత ఏడాది డిసెంబర్ క్రిస్మస్ సీజన్ లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ సలార్ మూవీ షారుక్ ఖాన్ డాంకీ మూవీతో పోటీ పడిన విషయం తెలిసిందే. ఈ పోటీ వల్లే నార్త్ లో 'సలార్' కలెక్షన్స్ దెబ్బతిన్నాయి. ఈ పోటీ వల్ల టాలీవుడ్ నుండి భారీ బడ్జెట్ లో రూపొందిన పాన్ ఇండియా సినిమాలు నేషనల్ హాలిడే రోజున రిలీజ్ చేస్తే ఆ సినిమాల్లో కలెక్షన్స్ పై ప్రభావం పడుతుందని, అదే సమయంలో బాలీవుడ్లో బడా ప్రాజెక్టులతో పోటీకి దిగినప్పుడు కూడా కలెక్షన్స్ దెబ్బతింటాయని దర్శక నిర్మాతలకు తెలిసి వచ్చింది.

ఇక ఇప్పుడు ఈ ఏడాది టాలీవుడ్ నుంచి రూపుదిద్దుకుంటున్న భారీ పాన్ ఇండియా సినిమాలకు కూడా బాలీవుడ్ సినిమాల నుంచి నార్త్ లో పలు ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ యాక్షన్ డ్రామా అయిన దేవర' పార్ట్ వన్ ఏప్రిల్ 5న రంజాన్ సందర్భంగా రిలీజ్ కాబోతోంది. సరిగ్గా అదే సమయంలో బాలీవుడ్లో అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్ కలిసి నటిస్తున్న 'బడే మియా చోటే మియా' మూవీ దేవరతో పోటీకి దిగుతోంది.

దీని తర్వాత ఆగస్టు నెలలో 'పుష్ప2' కి పోటీగా బాలీవుడ్ సింగం ఫ్రాంచైజీ 'సింగం అగైన్' సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ కి కూడా ఈ పోటీ తప్పేలా లేదు. మెగా పవర్ స్టార్ కమింగ్ మూవీ 'గేమ్ చేంజర్' రిలీజ్ డేట్ కి సంబంధించిన ఊహాగానాలు బాలీవుడ్ వర్గాల్లో ప్రకంపనులు సృష్టిస్తున్నాయి. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న 'గేమ్ చేంజర్' మూవీని దసరా లేదా గాంధీ జయంతి వారాంతంలో విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు ఆలోచిస్తున్నారట.

నిజానికి ఇదే డేట్ కోసం చాలామంది బాలీవుడ్ నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అక్షయ్ కుమార్ యాక్షన్ ఎంటర్టైనర్ 'స్కై ఫోర్స్'మూవీని అదే రోజున రిలీజ్ చేయబోతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే అక్షయ్ కుమార్ సినిమా కారణంగా నార్త్ లో 'గేమ్ చేంజర్' కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే 'డంకీ' ఎఫెక్ట్ తో సలార్ నిర్మాతలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మరి ఈ విషయంలో దిల్ రాజు ఏం చేస్తారనేది చూడాలి. సుమారు 250 కోట్ల భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కీర అద్వానీ అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.