Begin typing your search above and press return to search.

మెగా ఫ్యాన్స్.. గెట్ రెడీ!

ఇక గేమ్ చేంజర్ మూవీ నుంచి గ్లింప్స్ ని ఆగష్టు 15న విడుదల చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయ్యిందంట. ఈ గ్లింప్స్ తో మూవీపైన హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   19 July 2024 2:43 PM GMT
మెగా ఫ్యాన్స్.. గెట్ రెడీ!
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీకి ఫీనిషింగ్ టచ్ ఇస్తున్న సంగతి తెలిసిందే. గత రెండేళ్ల నుంచి ఈ మూవీ షూటింగ్ కొనసాగుతోంది. సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక సాంగ్ మాత్రమే రిలీజ్ చేశారు. అది కూడా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. అలాగే మూవీ నుంచి వచ్చిన స్టిల్స్ కూడా ఓ మోస్తరుగానే ప్రేక్షకులకి చేరువ అయ్యాయి. గేమ్ చేంజర్ సినిమాపై చెప్పుకోదగ్గ బజ్ అయితే లేదు. ఈ సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిపోయిన నేపథ్యంలో నెక్స్ట్ చిత్రాన్ని మార్కెట్ లోకి తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది.

ఇక గేమ్ చేంజర్ మూవీ నుంచి గ్లింప్స్ ని ఆగష్టు 15న విడుదల చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయ్యిందంట. ఈ గ్లింప్స్ తో మూవీపైన హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ 2 ఫ్లాప్ కావడంతో గేమ్ చేంజర్ సినిమా విషయంలో మెగా అభిమానులు టెన్షన్ పడుతున్నారు. వారికి గ్లింప్స్ తో సినిమా అవుట్ ఫుట్ ఎలా ఉంటుందనేది క్లారిటీ ఇవ్వబోతున్నారంట. మెగా ఫ్యాన్స్ కి ఇది శుభవార్త అని చెప్పొచ్చు.

మరో వైపు మెగాస్టార్ చిరంజీవి వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఆల్ మూవీ మూవీ షూటింగ్ చివరి దశకి వచ్చేసిందంట. ఇంకా రెండు సాంగ్స్, క్లైమాక్స్ సీక్వెన్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. వాటిలో త్వరలో ప్రారంభించబోతున్నారు. మరో వైపు మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఆగష్టు 22న విశ్వంభర టీజర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారంట.

ఈ టీజర్ తో విశ్వంభర సినిమాపై హైప్ క్రియేట్ అవుతుందని అంచనావేస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా సెకండ్ ఇన్నింగ్ లో చేస్తోన్న డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ఇదే కావడంతో కొంత హైప్ క్రియేట్ అయ్యి ఉంది. విశ్వంభర టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ బయటకి రావడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు.

అంటే ఒకే నెలలో తండ్రి కొడుకుల పాన్ ఇండియా సినిమాల నుంచి మెగా ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ని మేకర్స్ ఇవ్వబోతున్నారు. ఈ రెండు కూడా బజ్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే గేమ్ చేంజర్, విశ్వంభర సినిమాలపై భారీ అంచనాలు నెలకొని ఉన్న నేపథ్యంలో గ్లింప్స్ , టీజర్ ఏ మేరకు జనాల అటెన్షన్ ని గ్రాబ్ చేస్తాయనేది తెలియాల్సి ఉంది.