Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్ లీక్స్.. ఇది మ్యాటర్!

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   15 March 2024 3:02 PM GMT
గేమ్ ఛేంజర్ లీక్స్.. ఇది మ్యాటర్!
X

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఎప్పుడో మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు జెట్ స్పీడ్ లో సాగుతోంది. ఇటీవల హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ప్రస్తుతం వైజాగ్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి అప్డేట్ వచ్చి చాలా నెలలు అయింది.

వైజాగ్ లో జరుగుతున్న ఐదు రోజుల కీలక షెడ్యూల్ కోసం రామ్ చరణ్ తోపాటు మూవీ టీమ్ అంతా నిన్ననే అక్కడికి చేరుకుంది. ఆ సమయంలో చరణ్ ను చూసేందుకు భారీగా తరలివచ్చారు ఫ్యాన్స్. జై చరణ్, జై జై చరణ్ అంటూ రచ్చ రచ్చ చేశారు. ఇక ఎయిర్ పోర్ట్ బయట ఫ్యాన్స్ హడావుడి చూసి నటుడు ఎస్ జే సూర్య షాకయ్యారట. కాసేపు అలా నిల్చుండి పోయారట.

ఇదంతా పక్కన పెడితే.. ఈ సినిమాకు మరోసారి లీకుల బెడద తగిలింది. గేమ్ ఛేంజర్ సెట్స్ నుంచి రామ్ చరణ్ లుక్స్ లీక్ అయ్యాయి. పూర్తిగా క్లీన్ షేవ్, మీసంతో చరణ్ నయా లుక్ లో అదిరిపోయారు. స్పెక్ట్స్ ధరించి క్లాసీ లుక్ లో కనిపించారు. ఓ పొలిటికల్ పార్టీ మీటింగ్ సందర్భంగా చరణ్ ఈ లుక్‍ లో కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. చెర్రీ పిక్ తోపాటు మరో వీడియో కూడా లీక్ అయింది.

రామ్‍ చరణ్ కొత్త లుక్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఫ్యాన్స్, నెటిజన్లు తమ సోషల్ మీడియా వాల్స్ లో షేర్ చేసుకుంటున్నారు. చెర్రీ కొత్త లుక్ చూసి అభిమానులు సంబరపడుతున్నారు. కానీ మూవీ యూనిట్ మాత్రం నిరాశ వ్యక్తం చేస్తోంది. ఇంతకుముందు జరగండి సాంగ్ కూడా లీక్ అయింది. ప్రస్తుతం మూవీ టీమ్ చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమా.. సెప్టెంబర్ లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. మూవీలో ఐఏఎస్ అధికారిగా ఉండే చరణ్.. ఆ తర్వాత సీఎంగా కనిపిస్తారని టాక్ వస్తోంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. తెలుగమ్మాయి అంజలి కీలక పాత్ర పోషిస్తోంది. ఇక మార్చి 27వ తేదీన చరణ్ బర్త్ డే సందర్భంగా.. గేమ్ ఛేంజర్ సాలిడ్ అప్డేట్ రానుందని సమాచారం.