Begin typing your search above and press return to search.

గేమ్ చేంజర్ బ్యాలన్స్ చేస్తున్న శంకర్..!

ఒకప్పుడు వరుస సక్సెస్ లతో సూపర్ ఫాంలో ఉన్న శంకర్ ఈ మధ్య తన రేంజ్ కి తగిన హిట్లు కొట్టలేకపోతున్నాడు

By:  Tupaki Desk   |   19 Aug 2023 6:43 PM GMT
గేమ్ చేంజర్ బ్యాలన్స్ చేస్తున్న శంకర్..!
X

ట్రిపుల్ ఆర్ తర్వాత శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు రాం చరణ్. ఆర్.ఆర్.ఆర్ తో గ్లోబల్ స్టార్ గా ఇమేజ్ తెచ్చుకున్న చరణ్ తన నెక్స్ట్ సినిమాల ప్లానింగ్ తో అందరినీ సర్ ప్రైజ్ చేస్తున్నాడు. ముఖ్యంగా రెండు దశాబ్దాలకు ముందే పాన్ ఇండియాని షేక్ చేసిన సినిమాలు చేసిన శంకర్ దర్శకత్వం లో సినిమా తో మరోసారి బాక్సాఫీస్ షేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడు చరణ్. దిల్ రాజు బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమాపై అంచనాలు కూడా తారాస్థాయి లో ఉన్నాయి.

ఈ సినిమాను శంకర్ చాలా బ్యాలెన్స్ గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. తెలుగు హీరో తమిళ దర్శకుడు ఈ కాంబినేషన్ చాలా స్పెషల్. అయితే శంకర్ సినిమాల్లో ఎక్కడో ఒకచోట నేటివిటీ టచ్ ఉంటుంది. ఈ క్రమంలో అటు తమిళ, ఇటు తెలుగు ఫ్యాన్స్ ని బ్యాలన్స్ చేసేలా గేమ్ చేంజర్ ఉంటుందట. అంతేకాదు సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది కాబట్టి బీ టౌన్ ఆడియన్స్ అంచనాలను కూడా దృష్టిలో ఉంచుకుని సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది.

చరణ్ శంకర్ ఈ క్రేజీ కాంబో సినీ ప్రియులకు ఒక విజువల్ వండర్ అందిస్తారని తెలుస్తుంది. గేమ్ చేంజర్ ఒక పొలిటికల్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. మెగా ఫ్యాన్స్ కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలతో పాటుగా శంకర్ సినిమాల్లో ఉండే ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు థమన్ మ్యూజిక్ కూడా మెయిన్ హైలైట్స్ లో ఒకటిగా ఉంటుందని అంటున్నారు.

ఒకప్పుడు వరుస సక్సెస్ లతో సూపర్ ఫాంలో ఉన్న శంకర్ ఈ మధ్య తన రేంజ్ కి తగిన హిట్లు కొట్టలేకపోతున్నాడు. అందుకే చరణ్ గేమ్ చేంజర్ మీద చాలా ఫోకస్డ్ గా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడన్నది క్లారిటీ లేదు. కరెక్ట్ టైం చూసుకుని సినిమాను రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్. ఈ సినిమాతో పాటుగా శంకర్ కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమా కూడా చేస్తున్నారు. ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా రెండు దశాబ్దాల తర్వాత వస్తున్న ఇండియన్ 2 మీద కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. శంకర్ చేస్తున్న గేమ్ చేంజర్, ఇండియన్ 2 ఈ రెండు సినిమాలు ఆయన్ను మళ్లీ తిరిగి ఫాం లోకి తెచ్చేలా చేస్తాయా అన్నది చూడాలి.