గేమ్ ఛేంజర్.. క్రేజీ డీల్ సెట్టయ్యింది
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు
By: Tupaki Desk | 7 Nov 2023 1:12 PM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విషయంలో కాస్త ఆలస్యం జరిగినప్పటికీ కూడా చిత్ర యూనిట్ మాత్రం మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతుంది.
దర్శకుడు శంకర్ ఒకవైపు ఇండియన్ 2 సినిమాకు సంబంధించిన పనులను చూసుకుంటూనే మరొకవైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులను కూడా కొనసాగిస్తున్నాడు. ఇక సినిమాలోని మొదటి పాట కోసం కూడా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జరగండి అనే పాటపై ఇదివరకే అఫీషియల్ గా అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
త్వరలోనే లిరికల్ సాంగ్ విడుదల చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అయితే పాటను విడుదల చేయడం కంటే ముందుగానే ఇంటర్నెట్లో లీక్ అయిపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఈ విషయంపై చాలా సీరియస్ అయినా దిల్ రాజు టీం వెంటనే నిందితులపై చర్యలు కూడా తీసుకుంది. పోలీస్ కేసు నమోదు చేయడంతో ఒక ఇద్దరిని అరెస్టు కూడా చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఆడియో పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. మార్కెట్లో కూడా డిమాండ్ ఏర్పడింది. థమన్ ఇస్తున్న ఈ మ్యూజిక్ కోసం ఇప్పటికే రెండు బడా మ్యూజిక్ కంపెనీలు పోటీపడ్డాయి. మొత్తానికి భారీ ధరకు సారిగమ సంస్థ గేమ్ ఛేంజర్ మ్యూజిక్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
సౌత్ ఇండస్ట్రీలో పెద్ద సినిమాలకు సంబంధించిన ఆడియో రైట్స్ ను ఈ సంస్థ ఎక్కువగా దక్కించుకుంటుంది. ఇక ఇప్పుడు శంకర్ రామ్ చరణ్ థమన్ కాంబినేషన్ పై కూడా భారీగా క్రేజ్ ఉండడంతో ఈ సినిమా మ్యూజిక్ హక్కులను క్రేజీ డీల్ కు కొనుగోలు చేసినట్లు సమాచారం. నాన్ థియేట్రికల్ గానే సినిమా మంచి బిజినెస్ చేసే విధంగా నిర్మాత రాజు అడుగులు వేస్తున్నారు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నప్పటికీ షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా వేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ దీపావళికి మొదటి పాటను విడుదల చేసి ఆ తర్వాత రిలీజ్ డేట్ పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వబోతోంది.