Begin typing your search above and press return to search.

గేమ్ చేంజర్.. మరో గేమ్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్

By:  Tupaki Desk   |   6 Feb 2024 2:30 AM GMT
గేమ్ చేంజర్.. మరో గేమ్!
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ రామ్ చరణ్ కి జోడీగా నటిస్తోంది. అంజలి మరో కీలక పాత్రలో కనిపిస్తోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సోషల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

వింటేజ్ రామ్ చరణ్ ఈ చిత్రంలో ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా కనిపిస్తాడు. అలాగే ప్రెజెంట్ లోకి వస్తే ఐఏఎస్ ఆఫీసర్ గా సందడి చేయనున్నాడు. ఎస్.జె.సూర్య ఈ మూవీలో ప్రతినాయకుడిగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే సినిమా మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయిపొయింది. శంకర్ ఓ వైపు ఇండియన్ 2 మూవీ కంప్లీట్ చేస్తూ మరో వైపు గేమ్ చేంజర్ షూటింగ్ పై ఫోకస్ పెట్టారు.

ఈ రెండు పెద్ద సినిమాలు ఒకే సారి చేస్తూ ఉండటంతో గేమ్ చేంజర్ షూటింగ్ ఆలస్యం అవుతోంది. ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ నెక్స్ట్ షెడ్యూల్ కి శంకర్ ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. జూన్ నాటికి రామ్ చరణ్ సీక్వెన్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయంట. దాని తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మరో నెలలో ఫైనల్ షెడ్యూల్ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.

సినిమాని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. కానీ దసరాకి అందుబాటులోకి వస్తుందా లేదా అనేది చెప్పలేని విషయం. షూటింగ్ కంప్లీట్ అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది. శంకర్ పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం తీసుకుంటాడు. అందుకే ఈ ఏడాది ఆఖరులో గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది.

ఇక గేమ్ చేంజర్ షూటింగ్ కంప్లీట్ చేసిన వెంటనే రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోయే సినిమా షూటింగ్ కి సిద్ధం అవితాడు. పీరియాడిక్ జోనర్ లో ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉంటుందంట. ఏకంగా 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించబోతున్నారు.