గేమ్ ఛేంజర్.. అసలు పని ఎంతవరకు వచ్చింది?
చెన్నైలో మూడు రోజుల షూటింగ్ తర్వాత ఫైనల్ షెడ్యూల్ మాత్రమే ఉంటుందనే మాట వినిపిస్తోంది. ఆల్మోస్ట్ సినిమా కంప్లీట్ అయినట్లేనని ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారం నడుస్తోంది.
By: Tupaki Desk | 2 May 2024 3:49 AM GMTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ చేంజర్. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమా కథ ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే డైరెక్టర్ శంకర్ ఓవైపు ఇండియన్ 2 మూవీ చేస్తూనే గేమ్ చేంజర్ కూడా తెరకెక్కిస్తూ ఉండటంతో మూవీ షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.
రెండు భారీ సినిమాలు ఒకేసారి చేస్తూ ఉండడంతో గేమ్ చేంజర్ కంప్లీట్ కావడానికి రెండేళ్ల సమయం పట్టింది. రీసెంట్ గా హైదరాబాదులో ఎల్బీ స్టేడియం, ఎయిర్ పోర్ట్ లో సినిమాకి సంబంధించింది కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ షూటింగ్ లో రామ్ చరణ్, ఎస్ జె సూర్య, సునీల్ పాల్గొన్నారు. వీరి కాంబినేషన్ లో ఉన్న కీలక సీక్వెన్స్ ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
ఐదు రోజులు పాటు జరిగిన ఈ షూటింగ్ ముగించుకుని తాజాగా చిత్ర యూనిట్ చెన్నై వెళ్ళింది. అక్కడ మూడు రోజుల పాటు షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. చెన్నైలో మూడు రోజుల షూటింగ్ తర్వాత ఫైనల్ షెడ్యూల్ మాత్రమే ఉంటుందనే మాట వినిపిస్తోంది. ఆల్మోస్ట్ సినిమా కంప్లీట్ అయినట్లేనని ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారం నడుస్తోంది.
ఈ సినిమాలో కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి మరో కీలక పాత్రలో కనిపించనుంది. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఏడాది ఆఖరిలో గేమ్ చేంజర్ మూవీ థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉందని చిత్ర యూనిట్ నుంచి వినిపిస్తున్న మాట.
గేమ్ చేంజర్ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత శంకర్ కమల్ హాసన్ తో చేస్తోన్న ఇండియన్ 2 రిలీజ్ పైన ప్రస్తుతం ఫోకస్ చేయనున్నాడు. జూన్ 13న ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. దీని తర్వాత గేమ్ చేంజర్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి అవకాశం ఉంది. అలాగే రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ ఇదే కావడంతో ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు. అలాగే సోలోగా రామ్ చరణ్ మార్కెట్ ఎంత అనేది కూడా ఈ చిత్రంతో ఒక అంచనా వస్తుంది. గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో మరో హై బడ్జెట్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ కానుంది.