Begin typing your search above and press return to search.

గేమ్ చేంజర్ కోసం ఆ డైరెక్టర్ పనిచేయడం వెనుక రీజన్ అదేనా..?

రాం చరణ్, శంకర్ కాంబోలో దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ చేంజర్ సినిమా గురించి ఒక న్యూస్ మెగా ఫ్యాన్స్ ని షాక్ అయ్యేలా చేస్తుంది.

By:  Tupaki Desk   |   9 Jan 2024 8:17 AM GMT
గేమ్ చేంజర్ కోసం ఆ డైరెక్టర్ పనిచేయడం వెనుక రీజన్ అదేనా..?
X

రాం చరణ్, శంకర్ కాంబోలో దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ చేంజర్ సినిమా గురించి ఒక న్యూస్ మెగా ఫ్యాన్స్ ని షాక్ అయ్యేలా చేస్తుంది. అదేంటి అంటే ఈ సినిమాలో కొన్ని సీన్స్ ని హిట్ సినిమాల దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేశారట. అదేంటి గేమ్ చేంజర్ సినిమాకు డైరెక్టర్ శంకర్ కదా మరి శైలేష్ కొలను ఎందుకు కొన్ని సీన్స్ డైరెక్ట్ చేయాల్సి వచ్చింది అంటే ఆ విషయాన్నే సైంధవ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు డైరెక్టర్ శైలేష్ కొలను.


సినిమాల్లో కొన్ని సీన్స్ నటీనటులు లేకుండా డ్రోన్ షాట్స్, లొకేషన్ షాట్స్, వైడ్ యాంగిల్ షాట్స్, ఎస్టాబ్లిష్ షాట్స్ లాంటివి డైరెక్టర్ కి టైం కలిసి వస్తుందని అసిస్టెంట్ డైరెక్టర్స్ తో చేయిస్తుంటారు. అయితే శంకర్ మాత్రం ఇలాంటి సీన్స్ కూడా తనే డైరెక్ట్ చేస్తారు. కానీ గేమ్ చేంజర్ విషయంలో మాత్రం ఆ సీన్స్ ని శైలేష్ కొలను డైరెక్ట్ చేశారట. గేమ్ చేంజర్ సినిమా కోసం షూటింగ్ లొకేషన్ ని ముందుగానే బుక్ చేశారట. ఆ టైం కు శంకర్ అందుబాటులో లేకపోవడంతో ఆ ఎస్టాబ్లిష్ షాట్స్ తను డైరెక్ట్ చేశానని చెప్పారు.

లొకేషన్ కి ఆల్రెడీ డబ్బులు కట్టడం వల్ల ఎవరైనా మంచి డైరెక్టర్ ఉంటే తీయించండి అని శంకర్ సర్ చెప్పడంతో దిల్ రాజు గారు తనకు కాల్ చేసి అడిగారని రెండు రోజులు ఒక లొకేషన్ లో షూట్ చేశామని చెప్పుకొచ్చారు శైలేష్ కొలను. అవేవి సినిమాలో సీన్స్ కాదని.. జస్ట్ ఎస్టాబ్లిష్ షాట్స్ మాత్రమే అని అన్నారు శైలేష్ కొలను.

చిన్నప్పటి నుంచి శంకర్ సర్ సినిమాలు చూస్తూ పెరిగాను.. ఈరోజు ఆయన సినిమాలో చిన్న పాత్ర అయినందుకు సంతోషంగా ఉందని అన్నారు శైలేష్ కొలను. ఆయన డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ హీరోగా సైంధవ్ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఈ సినిమా విషయంలో కూడా సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు శైలేష్ కొలను.

దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ సరసన కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఆచార్య ఫ్లాప్ తర్వాత రాం చరణ్ చేస్తున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు.