Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్.. మళ్ళీ టెన్షన్ మొదలైంది

"గేమ్ చేంజర్" చిత్రం మొదట సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది.

By:  Tupaki Desk   |   5 Aug 2024 9:43 AM GMT
గేమ్ ఛేంజర్.. మళ్ళీ టెన్షన్ మొదలైంది
X

దర్శకుడు శంకర్ మొత్తానికి "గేమ్ చేంజర్" పైన దృష్టి సారించారు. ఇప్పటికే విడుదలైన "భారతీయుడు 2" చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, ఈ సీనియర్ డైరెక్టర్ ఇప్పుడు "గేమ్ చేంజర్" చిత్రాన్ని హిట్‌ చేయడం కోసం కష్టపడుతున్నారు. ఫ్యాన్స్ లో కూడా ఈ సినిమాపై ఎన్ని రకాల అనుమానాలు ఉన్నా కూడా రామ్ చరణ్ పైనే నమ్మకం పెట్టుకున్నారు.

"గేమ్ చేంజర్" చిత్రం మొదట సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. కానీ ఆ తరువాత ప్రమోషన్ విషయంలో అంత స్పీడ్ గా లేకపోవడంతో బజ్ తగ్గుతూ వస్తోంది. ఈ సినిమా షూటింగ్ దశకు చేరుకుంది అనే లోపే ఇంకా కొంత షూటింగ్ మిగిలి ఉందని మేకర్స్ నుంచి కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం శంకర్, హైదరాబాద్‌లో ఈ షూటింగ్‌ను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సుమారు 15 రోజులు పాటు షూటింగ్ మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ షూటింగ్ కోసం శంకర్ కొత్త లొకేషన్స్‌ను పరిశీలిస్తున్నారు. అయితే, ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలవుతాయని, శంకర్ ఈ సంవత్సరం చివర డిసెంబర్ లో "గేమ్ చేంజర్" చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు ఇటీవల నిర్మాత దిల్ రాజు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు.

ఇక లేటెస్ట్ టాక్ ప్రకారం సినిమా అనుకున్న సమయానికి రాకపోవచ్చట. డిసెంబర్ లో మిస్సయితే సంక్రాంతికి రావడానికి ఛాన్స్ లేదు. ఆల్రెడీ మెగాస్టార్ విశ్వంభర తో వస్తున్నాడు. ఇక సమ్మర్ ను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాజసాబ్ ఏప్రిల్ లో వస్తుండగా ఆ తరువాత విజయ్ దేవరకొండ 12వ సినిమా రానుంది. దీంతో ఎవరితోనూ క్లాష్ లేకుండా మార్చిలో రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మొత్తం మీద, శంకర్ తన కెరీర్‌లో తిరుగులేని హిట్ సాధించాలని, "గేమ్ చేంజర్"తో పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకోవాలని సంకల్పించారు. "గేమ్ చేంజర్" చిత్రంతో ప్రేక్షకులను మళ్లీ మెప్పించాలనుకుంటున్న శంకర్, ఈ సినిమా విడుదల తర్వాత "భారతీయుడు 3" పై దృష్టి సారించాలని ప్లాన్ చేస్తున్నారు. భారతీయుడు 2 అంచనాలను అందుకోకపోయినా, శంకర్ "

భారతీయుడు 3 పై పూర్తిగా నమ్మకంతో ఉన్నారు. మరి ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్లు అందుకుంటాయో చూడాలి.