Begin typing your search above and press return to search.

గేమ్ చేంజర్ కి ఆ సినిమాతో పోలిక?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ గేమ్ చేంజర్.

By:  Tupaki Desk   |   7 May 2024 4:09 AM GMT
గేమ్ చేంజర్ కి ఆ సినిమాతో పోలిక?
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ గేమ్ చేంజర్. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. గత రెండేళ్ల నుంచి ఈ మూవీ షూటింగ్ కొనసాగుతూనే ఉంది. శంకర్ ఓవైపు కమల్ హాసన్ ఇండియన్ 2 మూవీ చేస్తూనే గేమ్ చేంజర్ కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులే కావడం విశేషం. ఇండియన్ 2 జూన్ నెలలో రిలీజ్ కాబోతోంది.

ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరోవైపు గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ కూడా క్లైమాక్స్ దశకు చేరుకుంది. గేమ్ చేంజర్ నెక్స్ట్ షెడ్యూల్ రాజమండ్రిలో జరగనుంది. దాని తర్వాత హైదరాబాద్ లోనే ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసి షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టబోతున్నారంట. అలాగే ఈ ఏడాది ఆఖరులో గేమ్ చేంజర్ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

నిజానికి శంకర్ సినిమాల షూటింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. షూటింగ్ సమయంలో ఎలాంటి లీకులు లేకుండా కేర్ ఫుల్ గా ఉంటారు. అయితే గేమ్ చేంజర్ మూవీ విషయంలో ఎందుకనో మొదటి నుంచి లీక్స్ వస్తూనే ఉన్నాయి. ఏకంగా ఒక సాంగ్ మొత్తం లీకై సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

ఈ సాంగ్ ని తరువాత తొలగించి లీగల్ యాక్షన్ కూడా తీసుకున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న గేమ్ చేంజర్ మూవీ లీక్స్ మాత్రం ఆగడం లేదు. తాజాగా ఒక సీన్ కి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. రామ్ చరణ్ వింటేజ్ లుక్ లో ఒక లీడర్ గా ఈ వీడియోలో కనిపిస్తున్నారు. తన రాజకీయ వారసుడు శ్రీకాంత్ ని పరిచయం చేస్తున్నట్లు అందులో కనిపిస్తోంది.

ఈ వీడియో బట్టి గేమ్ చేంజర్ కథ విక్టరీ వెంకటేష్ సూపర్ హిట్ చిత్రం జయం మనదేరాకి దగ్గరగా ఉందనే ప్రచారం తెరపైకి వచ్చింది. జయం మనదేరా సినిమాలో వెంకటేష్ డ్యూయల్ రోల్ పోషించారు. సీనియర్ వెంకటేష్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఒక తక్కువ జాతి వ్యక్తిని లీడర్ గా నిలబెట్టే సీక్వెన్స్ ఉంటుంది. దానిని సహించలేని వారు వెంకటేష్ పై పగబట్టి చంపేస్తారు. అదే తరహాలో తాజాగా లీకైన వీడియో కూడా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

గేమ్ చేంజర్ మూవీలో కూడా సీనియర్ రామ్ చరణ్ క్యారెక్టర్ ఒక మాస్ లీడర్ గా, రాజకీయ నాయకుడిగా ఉంటుందనే మాట వినిపిస్తోంది. తండ్రి కొడుకులుగా రామ్ చరణ్ రెండు టైం లైన్స్ లో గేమ్ చేంజర్ సినిమాలో కనిపించబోతతున్నడని ఇప్పటికకే స్పష్టమైంది. అందుకే జయం మనదేరా సినిమాతో గేమ్ చేంజర్ కి పోలిక పెడుతున్నారు. కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకి కథ అందించారు. మరి జయం మనదేరా సినిమాకి గేమ్ చేంజర్ కథకి నిజంగానే దగ్గరి పోలికలు ఉన్నాయా లేదో తెలియాలి అంటే సినిమా రిలీజ్ తర్వాతే తెలుస్తుంది.