# RC 15 లో పవర్ స్టార్ నే దించేస్తే!
అందులోనూ 2019 ఎన్నికల సమయంలో అధికారిగా పనిచేసిన వ్యక్తి పాత్రనే స్పూర్తిగా తీసుకుని ఈ రోల్ డిజైన్ చేసినట్లు వినిపిస్తుంది.
By: Tupaki Desk | 23 Feb 2024 12:30 PM GMTమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'గేమ్ ఛేంజర్' పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఆలస్యమవుతుందనే విమర్శ తప్ప! శంకర్ కంటెంట్ పై ఎలాంటి సందేహం లేదు. సామాజిక దృక్కోణంలో శంకర్ కంటెంట్ పరంగా వీక్ అని చెప్పడానికి ఛాన్స్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు చరణ్ తోనూ తనదైన మార్క్ స్టోరీతోనే వస్తున్నారు.
ఇప్పటికే రాజకీయ నేపథ్యంలో సాగే సినిమా అని చరణ్ ఐఏఎస్ అధికారి నుంచి రాజకీయ నాయకుడిగా మారే రెండు వైవిథ్యమైన పాత్రలు పోషిస్తున్నాడని ప్రచారం పెద్ద ఎత్తు సాగింది. తాజాగా దీనికి సంబం ధించి మరో ఇంట్రెస్టివ్ విషయం లీక్ అవుతుంది. ఇందులో చరణ్ నిజాయితీగా ఎన్నికల అధికారి పాత్ర పోషిస్తున్నట్లు తాజా సమాచారం. రామ్ నందన్ అనే ఎన్నికల అధికారి పాత్రలో చరణ్ ని కొత్తగా చూపించ బోతున్నారుట.
రామ్ చరణ్ పేరుకు ఆ పాత్ర పేరు దగ్గరగా ఉండటంతో? ఈ సంగతి మరింత వైరల్ గా మారింది. అందులోనూ 2019 ఎన్నికల సమయంలో అధికారిగా పనిచేసిన వ్యక్తి పాత్రనే స్పూర్తిగా తీసుకుని ఈ రోల్ డిజైన్ చేసినట్లు వినిపిస్తుంది. అలాగే ఇదే కథలో నిజాయితీగల ఓ రాజకీయ నాయకుడి పాత్ర కూడా ఉందిట. అది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిజ జీవితానికి..రాజకీయ జీవితానికి అతి దగ్గరగా ఉంటుందిట. పవన్ కళ్యాణ్ నిజ జీవితాన్ని స్పూర్తిగా తీసుకుని రాజకీయ నాయకుడి పాత్రని డిజైన్ చేస్తున్నట్లు కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.
మరి ఇందులో నిజమెంతో తెలియాలి. శంకర్ ఎలాంటి పాత్రలు తీసుకున్నా అవి ఎంతో పవర్ పుల్ గా ఉంటాయి. వాస్తవ జీవితాలకు చాలా దగ్గరగానూ ఆయన పాత్రలు కనిపి స్తుం టాయి. ఆయన కథలన్నీ సమాజంలో పరిస్థితుల ఆధారంగా పుడతాయి కాబట్టి..అందులోనూ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా అని తొలి నుంచి ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో తాజాగా వెలుగులోకి వస్తున్న కొత్త సమాచారం ఆసక్తికరంగా కనిపిస్తుంది. మరి ఈ మొత్తం ప్రచారంలో నిజమెంతో శంకర్ ధృవీకరించాల్సి ఉంది. ఒకవేళ పవన్ స్పూర్తితోనే రాజకీనాయకుడి పాత్రని సృష్టిస్తే గనుక....అందులోనూ పీకేనే దించేస్తే ఎలా ఉంటుంది? అన్నది శంకర్ సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమే అవుతుంది.