Begin typing your search above and press return to search.

పుష్ప & గేమ్ ఛేంజర్.. పరిస్థితి ఎలా ఉంటుందో?

ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ చాలా నెలల క్రితమే వెల్లడించారు

By:  Tupaki Desk   |   16 Jun 2024 1:30 PM GMT
పుష్ప & గేమ్ ఛేంజర్.. పరిస్థితి ఎలా ఉంటుందో?
X

ఐకాన్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కొన్ని నెలలుగా ఆయన క్షణం తీరిక లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ లో బన్నీ లుక్స్ అదిరిపోయాయి. పుష్ప-1 నేషనల్ లెవెల్ లో బ్లాక్ బస్టర్ కావడంతో సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్ నుంచి బెస్ట్ అవుట్ పుట్ ఆశిస్తున్నారు బన్నీ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు.

ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ చాలా నెలల క్రితమే వెల్లడించారు. కానీ షూటింగ్ చాలా పెండింగ్ ఉండడంతో పోస్ట్ పోన్ అవ్వనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. రామ్ డబుల్ ఇస్మార్ట్ అదే రోజు రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్మెంట్ రావడంతో పుష్ప-2 వాయిదా పక్కా అని టాక్. ఇప్పుడు పుష్ప సీక్వెల్ నిజంగా పోస్ట్ పోన్ అయితే సరైన కొత్త రిలీజ్ డేట్ దొరకడం కష్టమే అని చెప్పాలి. వినాయక చవితి, దసరా, దీపావళి స్పెషల్ గా ఇప్పటికే పలు చిత్రాలు షెడ్యూల్ అయిపోయాయి.

దీంతో ఏడాది చివర్లో సినిమాను రిలీజ్ చేయాలని పుష్ప-2 మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. క్రిస్మస్ అండ్ లాంగ్ వీకెండ్ ను దృష్టిలో పెట్టుకుని డిసెంబర్ 20వ తేదీన విడుదల చేయాలని ఆలోచిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే అదే తేదీన స్టార్ హీరో రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. మరికొద్ది రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నారని టాక్.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఒకట్రెండు రోజుల్లో రామ్ చరణ్ పార్ట్ కంప్లీట్ అయిపోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఫాస్ట్ గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయాలని శంకర్ భావిస్తున్నట్లు సమాచారం. ఎలా అయినా ఈ ఏడాదే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారట. కొన్నేళ్లుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. శంకర్ ఇండియన్-2 కూడా చేయడంతో బాగా లేటైంది.

అయితే గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. కానీ బాక్సాఫీస్ వద్ద ఆ రెండు సినిమాలు క్లాష్ అయితే పరిస్థితులు వేరేలే ఉంటాయని చెబుతున్నారు. థియేటర్ల విషయంలో చాలా ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లి మరీ బన్నీ విష్ చేయడంతో.. కొన్నిరోజులుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా అభిమానుల మధ్య సోషల్ మీడియాలో చిన్నపాటి కోల్డ్ వార్ జరుగుతోంది. మరి ఆ రెండు మూవీలు ఒకే డేట్ లో వస్తే సీన్ ఎలా ఉంటుందో చూడాలి.