Begin typing your search above and press return to search.

బ‌రిలోకి 'గేమ్ ఛేంజ‌ర్' దిగేసాడు!

ఆగ‌స్టు 21 క‌ల్లా షెడ్యూల్ పూర్త‌య్యే అవ‌కాశం ఉందిట‌. ఇందులో రామ్ చ‌ర‌ణ్ తో పాటు ఇత‌ర ప్ర‌ధాన తారాగ‌ణం పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిం చుస్తునారు.

By:  Tupaki Desk   |   9 Aug 2023 7:29 AM GMT
బ‌రిలోకి  గేమ్ ఛేంజ‌ర్ దిగేసాడు!
X

'గేమ్ ఛేంజ‌ర్' ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా మారిన సంగ‌తి తెలిసిందే. 'ఆర్ ఆర్ ఆర్' త‌ర్వాత మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ ఏకంగా శంక‌ర్ తోనే సినిమా చేయ‌డంతో భారీ అంచ‌నాలు ఏర్ప‌డుతుడ న్నాయి. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు సినిమాని ప‌తాక స్థాయిలో నిల‌బెడుతున్నాయి. చ‌ర‌ణ్ ని ఎలాంటి పాత్ర‌లో చూపిస్తున్నారంటూ ఒక‌టే ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో క‌నిపిస్తుంది. రెండు వైవిథ్య‌మైన పాత్ర‌లు పోషిస్తున్నాడ‌ని ప్ర‌చారం సాగుతున్న‌ప్ప‌టికీ అందులో క్లారిటీ లేదు.

దీంతో చ‌ర‌ణ్ రోల్ ఏమై ఉంటుందా? అని ప్రేక్ష‌కాభిమానుల్లో వాడి వేడి డిస్క‌ష‌న్ న‌డుస్తోంది. ఇప్ప‌టికే కొద్ది భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా హైద‌రాబాద్ లో కొత్త షెడ్యూల్ మొద‌లైంది. రెండు వారాల పాటు హైద‌రాబాద్ లోనే షూటింగ్ జ‌ర‌గ‌నుంది.

ఆగ‌స్టు 21 క‌ల్లా షెడ్యూల్ పూర్త‌య్యే అవ‌కాశం ఉందిట‌. ఇందులో రామ్ చ‌ర‌ణ్ తో పాటు ఇత‌ర ప్ర‌ధాన తారాగ‌ణం పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిం చ‌నున్నారు. ఇప్ప‌టికే చాలా భాగం షూటింగ్ పూర్తిచేసిన సంగ‌తి తెలిసిందే.

వాస్త‌వానికి ఇప్ప‌టికే షూట్ మొత్తం పూర్త‌వ్వాలి. కానీ మ‌ధ్య‌లో 'ఇండియ‌న్-2' కూడా పున ప్రారంభం కావ‌డంతో ద‌ర్శ‌కుడు శంక‌ర్ రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం చేయాల్సి వ‌చ్చింది. 'గేమ్ ఛేంజర్' తో పాటు 'ఇండియ‌న్ -2' షూట్ కి కూడా ఒకేసారి హాజ‌ర‌వుతున్నారు. కొన్ని రోజుల పాటు ఒక సినిమా కి ఏక‌ధాటిగా షూటింగ్ నిర్వ‌హించి అటుపై రెండ‌వ సినిమా సంగ‌తి చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే 'గేమ్ ఛేంజర్' ఆల‌స్య‌మ‌వుతుంది.

ఈ క్ర‌మంలోనే 'గేమ్ ఛేంజ‌ర్' రిలీజ్ పై కూడా నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. ఎప్పుడూ పూర్త‌వుతుంది? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అన్న దానిపై స‌రైన క్లారిటీ లేదు. సంక్రాంతి...స‌మ్మ‌ర్ అంటూ కొన్ని తేదీలు తెర‌పైకి వ‌స్తున్న‌ప్ప‌టికీ అప్ప‌టికి క‌ష్ట‌మేనే యూనిట్ వ‌ర్గాల నుంచి లీకులందుతున్నాయి.