Begin typing your search above and press return to search.

'గేమ్​ ఛేంజర్' రిలీజ్ డేట్​ టార్గెట్​ అదే

ఈ సినిమాను మార్చి మూడు లేదా నాలుగో వారంలో విడుదల చేసే అవకాశముందని సినీ వర్గాల ఇన్​ సైడ్​ టాక్​

By:  Tupaki Desk   |   2 Aug 2023 11:30 PM GMT
గేమ్​ ఛేంజర్ రిలీజ్ డేట్​ టార్గెట్​ అదే
X

తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్​ మెసేజ్​కు భారీ కమర్షియల్​ హంగులను జోడించి సినిమాలను తీర్చిదిద్దుతారు. ఎక్కడా రాజీ పడకుండా లార్జన్‌ దేన్‌ లైఫ్‌ అన్నట్టుగా సినిమా చూపిస్తుంటారు. ఆయితే గత కొంతకాలంగా భారీ హిట్​లను అందుకోలేకపోయిన ఆయన.. ప్రస్తుతం కమల్​ హాసన్​తో 'భారతీయుడు 2', రామ్​చరణ్​తో​ 'గేమ్​ ఛేంజర్'పైనే ఆశలు పెట్టుకున్నారు. సినీ ప్రియులు కూడా ఈ రెండు చిత్రాల కోసం ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ రెండింటిలో 'గేమ్​ ఛేంజర్' సినిమా రిలీజ్​ డేట్​పై ఇప్పటికీ ఓ క్లారిటీ రాలేదు. అదుగో సినిమా వచ్చేస్తుంది. ఇదిగో సినిమా వచ్చేస్తుందంటూ మూవీ మేకర్స్ ఊరిస్తున్నారే తప్ప సరైన డేట్​ను చెప్పట్లేదు. ఆ మధ్యలో వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా ఆ తర్వాత వేసవికి రిలీజ్ అవుతుందనే ప్రచారం కూడా సాదింది. కానీ దీనిపై ఓ క్లారిటీ రాలేదు.

వాస్తవానికి ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకుని రిలీజ్​కు రెడీ అయిపోయేది. కాకపోతే మధ్యలో ఆగిపోయిన 'భారతీయుడు 2' మళ్లీ శంకర్​ లైనప్​లోకి ఎంట్రీ ఇచ్చేసరికి అన్నీ మారిపోయాయి. 'గేమ్ ఛేంజర్'​ షూటింగ్ షెడ్యూల్స్​ పోస్ట్​ పోన్​ అయిపోయాయి. శంకర్​ రెండు చిత్రాలకు ఒకేసారి బ్యాలెన్స్ చేస్తూ దర్శకత్వం చేయడం ప్రారంభించారు.

అదే సమయంలో మెగా అభిమానులు గేమఛేంజర్​ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఈగర్​గా వెయిట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్​ డేట్​పై దాదాపుగా ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను మార్చి మూడు లేదా నాలుగో వారంలో విడుదల చేసే అవకాశముందని సినీ వర్గాల ఇన్​ సైడ్​ టాక్​.

అంతా అనుకున్నట్టు జరిగితే ఈ సమయంలోనే చిత్రాన్ని ఎలాగైనా రిలీజ్​ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. ఇకపోతే వచ్చే సంక్రాంతికి కమల్​హాసన్​ భారతీయుడు 2 దాదాపుగా కన్ఫామ్​ అయిపోయిందని తెలిసింది.

అంటే రెండు నెలల గ్యాప్​లో శంకర్​ తన రెండు భారీ చిత్రాలను రిలీజ్​ చేయనున్నారన్న మాట. ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్క చిత్రం హిట్​ అయినా శంకర్ రేంజ్​ మళ్లీ భారీగా పెరిగిపోతుంది. ఆయన గట్టి కమ్​ బ్యాక్ ఇచ్చినట్టవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..