Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్ గుడ్ న్యూస్.. కాస్త ముందుగానే..

అయితే తాజా సమాచారం ప్రకారం ఇండియన్ 2 కంటే ముందుగానే సమ్మర్ కానుకగా గేమ్ చేంజర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.

By:  Tupaki Desk   |   24 Aug 2023 3:51 AM GMT
గేమ్ ఛేంజర్ గుడ్ న్యూస్.. కాస్త ముందుగానే..
X

సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తోన్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. శంకర్ ఫస్ట్ టైం తెలుగులో చేస్తోన్న బిగ్ బడ్జెట్ మూవీ ఇదే కావడం విశేషం. అతని గత సినిమాలు అన్ని తమిళంలో తెరకెక్కిన తెలుగులో కూడా రిలీజ్ అవుతూ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు గేమ్ చేంజర్ అంతకుమించి పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మూవీ షూటింగ్ దశలో ఉంది. కీలక ఎపిసోడ్స్ ని శంకర్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. కియారా అద్వానీ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. మెగా ఫ్యాన్స్ గేమ్ చేంజర్ మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. కచ్చితంగా బ్లాక్ బస్టర్ ఇస్తాడనే నమ్మకంతో ఉన్నారు.

అయితే సినిమా రిలీజ్ ఎప్పుడనేది అస్సలు క్లారిటీ లేదు. నిర్మాత దిల్ రాజు కూడా కనీసం రిలీజ్ పై ఏమీ చెప్పలేకపోయారు. దర్శకుడు శంకర్ ఎప్పుడు అంటే అప్పుడే రిలీజ్ అవుతుందని ఓ మీడియా సమావేశంలో చెప్పారు. శంకర్ గేమ్ చేంజర్ తో పాటుగా కమల్ హాసన్ ఇండియన్ 2 మూవీ కూడా చేస్తున్నారు. తమిళంలో ప్రతిష్టాత్మకంగా ఆ చిత్రం తెరకెక్కుతోంది.

సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. విక్రమ్ తర్వాత కమల్ హాసన్ నుంచిరాబోతున్న హైయెస్ట్ బడ్జెట్ మూవీ ఇండియన్ 2. రెండు సినిమాలు ఒకేసారి గ్యాప్ తీసుకొని శంకర్ చేస్తున్నారు. ఈ కారణంగా గేమ్ చేంజర్ రిలీజ్ పై స్పష్టత లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇండియన్ 2 కంటే ముందుగానే సమ్మర్ కానుకగా గేమ్ చేంజర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.

నిజానికి ఇండియన్ 2 ముందుగా వేసవిలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ఆ మూవీ ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఇంకా చాలా పెండింగ్ లో ఉందంట. ఈ కారణంగా ఇండియన్ 2 వాయిదా వేసే ప్లాన్ లో ఉన్నారంట. ఆ ప్లేస్ లో రామ్ చరణ్ గేమ్ చేంజర్ ని ఏప్రిల్ లో ప్రేక్షకులకి అందించే ప్రయత్నంలో ఉన్నారంట. ఇప్పటికే షూటింగ్ మెజారిటీ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీలైనంత వేగంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల మాట.