Begin typing your search above and press return to search.

చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌ కి సీక్వెల్‌ దెబ్బ..!

రామ్‌ చరణ్‌, శంకర్ కాంబోలో రూపొందుతున్న గేమ్‌ ఛేంజర్ సినిమా విడుదల విషయంలో క్లారిటీ వచ్చేసింది.

By:  Tupaki Desk   |   23 July 2024 7:06 AM GMT
చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌ కి సీక్వెల్‌ దెబ్బ..!
X

రామ్‌ చరణ్‌, శంకర్ కాంబోలో రూపొందుతున్న గేమ్‌ ఛేంజర్ సినిమా విడుదల విషయంలో క్లారిటీ వచ్చేసింది. మొన్నటి వరకు దసరా లేదా దీపావళి అనే వార్తలు వచ్చాయి. కానీ ఇటీవలే నిర్మాత దిల్‌ రాజు క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. డిసెంబర్‌ లో పుష్ప 2 ఉన్నా కూడా గేమ్ ఛేంజర్ ను అదే నెలలో విడుదల చేయబోతున్నారు.

సౌత్‌ లో క్రిస్మస్ కి పెద్ద సినిమాలు ఏమీ లేక పోవచ్చు. కానీ ఉత్తర భారతంలో మాత్రం గేమ్‌ చేంజర్‌ కి పెద్ద పోటీ తప్పేలా లేదు. హిందీలో రూపొందిన సితారే జమీన్ పర్‌ విడుదల అవ్వబోతున్నారు. అమీర్ ఖాన్ గతంలో నటించి సూపర్ హిట్‌ అయిన తారే జమీన్‌ పర్ కి ఇది సీక్వెల్‌ అనే ప్రచారం జరుగుతోంది.

అమీర్‌ ఖాన్‌ కి బాలీవుడ్‌ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా ఎలా ఉన్నా కూడా మినిమం వారం పది రోజుల పాటు మంచి వసూళ్లు నమోదు చేస్తుంది. కనుక గేమ్‌ చేంజర్ అదే సమయంలో విడుదల అయితే కచ్చితంగా ఇబ్బందులు తప్పవు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఆ విషయమై నిర్మాత దిల్‌ రాజు ఎలా ప్లాన్‌ చేస్తాడు అనేది చూడాలి. రామ్‌ చరణ్, కియారా అద్వానీ జంటగా రూపొందుతున్న ఈ సినిమాలో అంజలి కీలక పాత్రలో కనిపించబోతుంది. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న గేమ్‌ ఛేంజర్ ఉత్తర భారతంలో కూడా భారీగా వసూళ్లు సాధిస్తేనే అనుకున్న టార్గెట్‌ రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

గేమ్‌ ఛేంజర్ సినిమాకు అమీర్ ఖాన్‌ సీక్వెల్‌ దెబ్బ వేసే అవకాశం ఉంటే నిర్మాత మరియు బయ్యర్లు ఏం చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికర విషయం. ఇప్పటికే విడుదల తేదీ విషయంలో చాలా సార్లు మార్పులు జరిగాయి. కనుక వచ్చే ఏడాదికి వాయిదా వేయడం అనేది ఉండక పోవచ్చు.