Begin typing your search above and press return to search.

గేమ్ చేంజర్.. అసలు బ్యాలెన్స్ వర్క్ ఎంత?

శంకర్ ఓ వైపు ఇండియన్ 2 చేస్తూనే గేమ్ చేంజర్ చిత్రాన్ని తెరకెక్కించారు.

By:  Tupaki Desk   |   20 Jun 2024 4:09 AM GMT
గేమ్ చేంజర్.. అసలు బ్యాలెన్స్ వర్క్ ఎంత?
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి రాబోయే పాన్ ఇండియా మూవీ ఇదే కావడంతో సినిమాపై హైప్ నెలకొని ఉంది. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ చాలా కాలంగా షూటింగ్ స్టేజ్ లో ఉంది. శంకర్ ఓ వైపు ఇండియన్ 2 చేస్తూనే గేమ్ చేంజర్ చిత్రాన్ని తెరకెక్కించారు.

అందుకే మూవీ షూటింగ్ చాలా టైమ్ తీసుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉందంట. ప్రస్తుతం ఈ సినిమాలో రామ్ చరణ్ కి సంబందించిన కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. రామ్ చరణ్ క్యారెక్టర్ కి సంబంధించి షూటింగ్ ఒక్క రోజు మినహా అంతా పూర్తయ్యిందంట. మిగిలిన ఆ ఒక్కరోజు షూట్ కూడా సముద్రఖని కాంబినేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

దీని తర్వాత మరో 10 రోజులు షూటింగ్ ఉంటుందంట. ప్యాచ్ వర్క్ తో పాటు పెండింగ్ సీక్వెన్స్ ని ఫైనల్ గా శంకర్ పూర్తి చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని మొదట దీపావళికి రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంత వేగంగా పూర్తయ్యే అవకాశాలు ఉండకపోవచ్చని సమాచారం. దీంతో క్రిస్మస్ ఫెస్టివల్ ని వినియోగించుకోవాలని అనుకుంటున్నారు.

అన్ని అనుకున్నట్లు అయిపోతే డిసెంబర్ 25కి గేమ్ చేంజర్ ని థియేటర్స్ లో చూడొచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ ఆచార్య మూవీలో కనిపించారు. అయితే అది డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో గేమ్ చేంజర్ మూవీ వస్తోంది. కచ్చితంగా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి తన మార్కెట్ పెంచుకోవాలని చరణ్ అనుకుంటున్నారు.

గేమ్ చేంజర్ పూర్తి కావడంతో రామ్ చరణ్ బుచ్చిబాబుతో చేస్తోన్న RC 16 చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొని వెళ్లే అవకాశం ఉంది. జులై నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కావొచ్చని సమాచారం. ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. దేవర తర్వాత తెలుగులో ఆమె చేస్తోన్న రెండో సినిమా RC16 కావడం విశేషం. ఇక ఈ సినిమాలో మరికొందరు ప్రముఖ నటీనటులు కూడా భాగం కాబోతున్నారు. ఏఆర్.రెహమాన్ సంగీతం అందించనున్నారు.