Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్.. ఇంకా పెండింగ్ వర్క్ ఎంతుంది?

15 రోజుల షూటింగ్ ఇంకా పెండింగ్ ఉంది. దానికోసం లొకేషన్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   16 July 2024 2:45 AM GMT
గేమ్ ఛేంజర్.. ఇంకా పెండింగ్ వర్క్ ఎంతుంది?
X

భారతీయుడు 2 మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి డివైడ్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు అయితే కలెక్షన్స్ బాగానే వచ్చాయి. వీక్ డేస్ లో ఏ స్థాయిలో వసూళ్లని సాధిస్తుంది అనేదాని మీద ఈ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. భారతీయుడు సినిమాతో కంపారిజన్ చేసి భారతీయుడు 2 మూవీ చూడటంతో ఆడియన్స్ డిజప్పాయింట్ అయినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలలో 11+ కోట్ల వరకు మొదటి మూడు రోజుల్లో భారతీయుడు కలెక్ట్ చేసింది.

ఇలా లాంగ్ రన్ లో ఎంత వసూళ్లు చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే భారతీయుడు 2 మూవీ రిలీజ్ కావడంతో శంకర్ ఫోకస్ ఇప్పుడు గేమ్ చేంజర్ మీద పడింది. వరుసగా నాలుగు ఫెయిల్యూర్స్ శంకర్ కి వచ్చాయి. దీంతో దర్శకుడిగా అతని కెరియర్ అయిపోయిందనే ప్రచారం తెరపైకి వచ్చింది. అతను ఈ జెనరేషన్ ఆలోచనలకి సరిపోయే విధంగా కథలు చెప్పలేకపోతున్నారని సినీ విశ్లేషకులు విమర్శలు చేస్తున్నారు.

అయితే 20-30 ఏళ్ళ క్రితమే శంకర్ ఆలోచనలు చాలా అడ్వాన్స్ గా ఉండేవి. అందుకే అతని సినిమాలకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. గేమ్ చేంజర్ తో తన ఫామ్ ని శంకర్ తిరిగి ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అందుకే ఈ సినిమా పెండింగ్ షూటింగ్ కోసం శంకర్ హైదరాబాద్ వచ్చారంట. 15 రోజుల షూటింగ్ ఇంకా పెండింగ్ ఉంది. దానికోసం లొకేషన్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

భారతీయుడు 2 మూవీ ఫెయిల్యూర్ ఇంపాక్ట్ గేమ్ చేంజర్ మీద పడుతుందని అందరూ భావిస్తున్నారు. అయితే అన్నిటికి తన వర్క్ తోనే శంకర్ సమాధానం చెప్పాలని అనుకుంటున్నారు. మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ మీద పూర్తిస్థాయిలో ఫోకస్ చేయనున్నారంట. ఈ ఏడాది ఆఖరులో గేమ్ చేంజర్ మూవీని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యాక రిలీజ్ ఎప్పుడనేది శంకర్ క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉందంట.

గేమ్ చేంజర్ రిలీజ్ తర్వాత భారతీయుడు 3 మూవీ రిలీజ్ చేయాలని శంకర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్ట్ 2 ఫెయిల్ అయిన కూడా భారతీయుడు 3 మాత్రం కచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో శంకర్ ఉన్నారు. అంతకంటే ముందుగా గేమ్ చేంజర్ తో పాన్ ఇండియా లెవల్ లో బ్లాక్ బస్టర్ కొట్టాలని అనుకుంటున్నారు.